Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఉక్కుపరిశ్రమకు వ్యతిరేకంగా కుట్రలు మానుకోవాలి

pp

బయ్యారం : బయ్యారం ఉక్కుపరిశ్రమకు వ్యతిరేకంగా కొత్తగూడెం ఎంఎల్‌ఏ జలగం వెంకట్రావ్ మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాడని వాటిని తిప్పికొట్టిలని పరిశ్రమ సాధన కమిటీ కన్వీనర్ బయ్యారం జడ్‌పిటిసి గౌని ఐలయ్య అన్నారు. బుధవారంతో 41వ రోజు ఉక్కు సాధన దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో ఆయన కుర్చున్నారు. ఆర్య వైశ్య సంఘం సభ్యులను ఉద్దేశించి ఐలయ్య ప్రసంగిస్తు నిన్న జలగం వెంకట్రావ్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రిని కలిసి విభజన చట్టంలో హామీ ఐనా ఉక్కు పరిశ్రమను పాల్వంచలో పెట్టమని కోరడం వారి కుట్రలో భాగమేనన్నారు. గతంలో సెయిల్ బృందం వచ్చిన సం దర్భంలో కూడా పాల్వంచ, కొత్తగూడెం పరిసరాలలో పరిశ్రమ పెట్టలని వత్తిడి చేయడం, వారిని తీసుకెళ్ళి రేగళ్ల , కూనారం , ప్రాం తంలో పరిశీలన చేయించారని గుర్తు చేవారు. గతంలో జిల్లా రాజకియ పార్ట్ట్టిలన్నీ పరిశ్రమను బయ్యారంలోనే పెట్టాలని కోరారని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఉక్కు పరిశ్రమ బయ్యారంలోనే పెట్టాలని ఏకగ్రీవంగ తీర్మానం చేసిందన్నారు. మరి ఇప్పుడు దానికి భిన్నాంగా టిఅర్‌ఎస్, ఎంపి. ఎంఎల్‌ఎలు, పాల్వంచలో పెట్ట్టామని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండా రాజన, గంగుల సత్యనారాయణ, నాగేశ్వరరావు, మధు, పుసులూరి రంగ య్య, వల్లలా వెంకన్నలు పాల్గ్గొన్నారు. దీక్షలో కూర్చున్నా వారిలో ఎంశెట్టి నాగయ్య, హనుమంతురావు, కోటేశ్వరావు, గిరిబాబు, శ్రీనివాస్, వేణు, లక్ష్మయ్య పాల్గ్గొన్నారు.

Comments

comments