Search
Sunday 21 January 2018
  • :
  • :

భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి మండల మహాపడిపూజ

ayyappaమనతెలంగాణ/మెదక్ టౌన్ : పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో మండల మహాపడిపూజను మంగళవారము నాడు హరిదాస్ గురుస్వామి, ఆలయ ప్రధానార్చకులు రాజుపంతులు, గంగ లక్ష్మిపతి గురుస్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాపడిపూజకు పెద్ద ఎత్తున అయ్యప్పస్వాములు, భక్తులు పాల్గొన్నారు. మహాపడి పూజ సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు డిప్యూటిస్పీకర్‌ను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అయప్పస్వామి కృపాకటాక్షాలు ప్రజలందరికి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అయ్యప్పస్వాముల కోరిక మేరకు నూతన జిల్లా గ్రంధాలయాన్ని నిర్మించిన అనంతరం ఇట్టి స్థలాన్ని కొంతమేరకు ఆలయానికి కేటాయిస్తామన్నారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయసహకారం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రం ఏర్పడినందున పట్టణ ప్రజలందరు అభివృద్ధికి సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణలో కూడా ప్రజలందరూ సహకరిస్తున్నారని, పెద్దబజార్‌లో స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణకు ముందుకువచ్చారన్నారు. ఆలయాల అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. శబరిమలకు వెళ్ళే అయ్యప్పస్వాములకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా స్వామివారి దర్శనం చేసుకొని రావాలని అయ్యప్పస్వామిని కోరుకున్నట్లు డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మహాపడి పూజలో మున్సిపల్ చైర్మేన్ మల్లికార్జున్‌గౌడ్ పాల్గొని భక్తి పార్యవశ్యంతో భజనలు చేశారు. ఆలయంలో స్వామి వారి పడిపూజ సందర్భంగా అయ్యప్పస్వాములు, భక్తులు స్వామివారి కీర్తనలు, భజనలతో ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప అంటూ మార్మోగింది. పూజా అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సత్యం, అయ్యప్పస్వాములు రామాంజనేయులు, కొండ శ్రీనివాస్, పురం వెంకట్‌నారాయణలతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు, మున్సిపల్ వైస్ చైర్మేన్ రాగి అశోక్, కౌన్సిలర్లు, అయ్యప్పస్వాములు కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

comments