Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

రష్యన్‌లో ‘బాహుబలి’ ట్రైలర్ చూశారా..?

Russian-Bahubali-Trailer

హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అపురూప దృశ్యకావ్యం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’. ఈ చిత్రంతో జక్కన్న తెలుగు సినిమాను అంతర్జాతీయంగా పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన బాహుబలి ప్రస్తుతం ఇతర దేశాల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీని రష్యా, జపాన్‌లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం రష్యన్ భాషలో బాహుబలి ట్రైలర్‌ను నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. డిసెంబర్ 29న జపాన్ లో విడుదల కానుండగా, జనవరిలో రష్యాలో విడుదల కానుంది. రష్యన్ బాహుబలిపై మీరు ఓ లుక్కేయండి.

Comments

comments