Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పథకాలకు ఆర్థిక చేయూతనివ్వని బ్యాంకులు

SBI*బ్యాంకర్లు సమావేశానికి రాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం
*రుణాల తీరుపై అసంతృప్తి
*పరిశ్రమల లబ్ధిదారులను త్వరగా గ్రౌండింగ్ చేయాలి
*వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఎస్‌బిఐకి చెందిన బ్యాంక్ నియంత్రణాధికారి రాకపోవడంపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకులు రుణాలను మంజూరు చేయకపోవడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తంచేశారు.  నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు తద్వారా వారి కాళ్లపై వారు నిలబడేందుకు బ్యాంకుల ద్వారా ఆర్థిక అండనిచ్చే కార్యక్రమాలు అమలుచేస్తున్నామని, వాటి అమలులో బ్యాంకులు పురోగతి చూపలేకపోవడం విచారకరమని అమ్రపాలి అన్నారు. శుక్రవారం సా యంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లీడ్‌బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా (కన్సల్టేటివ్) సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పంట రుణా లు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు రుణాలు, స్టాండప్ ఇండియా ముద్రాయోజన తదితర కార్యక్రమాల అమలులో బ్యాంకుల వారి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌బిఐ లీడ్ బ్యాంకుగా ఉండి భార త ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చే స్తూ స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్న ముద్రా యోజన స్టాండప్ ఇండియా లాం టి కార్యక్రమాలలో ఎటువంటి పురోగతి చూపకపోవడం విచారకరమన్నారు. అలా గే ఇలాంటి ముఖ్యమైన సమావేశంలో ఎస్‌బిఐ తరపున నియంత్రణాధికారి కూడా రాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవిషయాలను రాష్ట్రస్థాయి బ్యాం కర్ల సమన్వయ కమిటీకి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వారి వద్ద నున్న ప్రభుత్వ నిధులు కొన్నింటిని ఎస్‌బిఐ నుంచి ఆంధ్రాబ్యాంకు బదిలీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పంట రుణాలు పొందిన రైతులకు పంట బీమా కల్పించిన వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఈ సందర్భం గా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. స్వయం సహాయక సంఘ సభ్యులు, కుటుంబసభ్యులు పంట రుణం తీసుకుంటే దాని ప్రభావం ఆ గ్రూప్‌తీసుకునే రుణాలపై చూపకూడదని కలెక్టర్ అన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా అనేక మందిని ఎంపిక చేసి వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద యూనిట్లు మంజూరి చేయడం జరిగిందని, వాటిని సంబంధిత బ్యాంకర్లు త్వరితగతిన గ్రౌండింగ్ చేసేలా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే మెప్మా నుంచి రుణాలు మంజూరి చేసిన స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చే సమయంలో మెప్మా సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మంగపతిరావు మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను సభకు వివరించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి రూ.426.29 కోట్ల పంట రుణాలు ఇవ్వడం జరిగిందని, 2,635 స్వయం సహాయక సంఘాలకు రూ.55.87 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలు ఇచ్చామని తెలిపారు.
రిజర్వు బ్యాంకు మేనేజర్ గణేష్ మాట్లాడుతూ, పంట రుణాలలో పదిశాతం కౌలుదారులకు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి సమావేశంలో మాట్లాడుతూ 2018-19 పొటెన్షియల్ లింక్‌డ్ క్రిడిట్ ప్లాన్‌లో నీరు ఆదా చేస్తూ పంటలు సాగుచేసే వారికి, సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసే వారికి డెయిరీ యూనిట్లకు రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2018-19 పొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎపిజివిబి రీజనల్ మేనేజర్ విశ్వప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాముతో పాటు వ్యవసాయశాఖ అధికారి ఉష, మైనార్టి సంక్షేమ అధికారి రత్నకుమారి, పరిశ్రమల శాఖ అధికారి రుషికేష్ వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments