Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

కామారెడ్డిలో జోరందుకోనున్న సైకిల్

CYCLE

*క్షేత్రస్థాయిలో గడపగడపకూ టిడిపి కార్యకర్తల
ప్రచారం
*టిఆర్‌ఎస్ బెదిరింపులకు గుణపాఠం
చెప్పేందుకు సిద్ధం
*ఉమ్మడి జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం

మన తెలంగాణ/కామారెడ్డి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం ఎదురైంది. పార్టీ ఉనికి కాపాడేందుకు తెలుగు తమ్ముళ్లు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవానికి రావడానికి ప్రస్తుత తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పార్టీ బలహీనపడింది. గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ అధికార పార్టీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం టిడిపి కార్యకర్తలను నాయనో భయానో బెదిరిస్తూ వారిని టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంచు తూ రెవెన్యూ, పోలీస్, తదితర శాఖలతో ఇబ్బందులకు గురి చేస్తుండడంతో స్తబ్దంగా ఉన్న కార్యకర్తలు రాబోయే 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యార్థుల ఆత్మబలిదానాలతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు గంప గోవర్దన్,  షిండే  ప్రజల అభిప్రాయాలతో టిఆర్‌ఎస్ కండువా వేసుకున్నప్పటికీ జన్మస్థానమైన టిడిపి పార్టీకి సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి టిడిపిని వదలడంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష స్థాన ంలో ఉన్న సుభాష్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డిలు పార్టీ ని మారినప్పటికీ టిడిపి పార్టీకి నష్టమేం లేదని గ్రామ స్థాయి నాయకులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వారు సామాన్య కార్యకర్తల్లాగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుందని టిడిపి సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుండి తిరుగులేని మెజార్టీ ని ఇచ్చిన ఘనత కామారెడ్డి ప్రజల కు దక్కింది. కాంగ్రెస్ గాలిలో సైతం టిడిపికి కామారెడ్డి తరపున గంపగోవర్దన్ ఎన్నికయ్యారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో పంచాయతీ రాజ్, తదితర శాఖలను నిర్వహించారు. ఎల్లారెడ్డిలో  నేరెళ్ల ఆంజనేయులు వరుసగా నాలుగు సార్లు  ఎమ్మెల్యేగా గెలిచి సాం కేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. టిడిపిలో యోధాను యో ధులుగా ఉన్న నాయకులు పార్టీని వీడడానికి  కారణం ప్రస్తుత టిఆర్‌ఎస్ పార్టీ ఒంటెద్దు పోకడతో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు బెదిరిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నప్పటికీ రాబోయే  ఎన్నికల్లో తిరిగి స్వంత పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు టిడిపి పార్టీలో రాజకీయ జీవి తం ప్రారంభించారని, జన్మనిచ్చిన టిడిపి పార్టీకి రాబోయే ఎన్నికల్లో టిడిపి పార్టీ  గుర్తుపై పోటీ చేసేందుకు సంసిద్ధంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి పనిచేసిన కార్యకర్తలను మరిచి ఇతర పార్టీలోకి చేర్చిన వారికే మంత్రి పదవులు నామినేట్ పోస్టులు ఇస్తున్నప్పటికి రాజకీయ జీవితం ఇచ్చిన టిడిపి పార్టీకిలో పైకారంగా ఆ ప్రతినిధులు పనిచేస్తున్నారని ప్రజల అభిప్రాయం వ్యక్తమవుతుంది. కామారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ యంత్ర లక్ష్మీ, సబ్సిడీ రుణాలు, పోలీస్ కేసులు తదితర సమస్యలతో క్యాడర్‌ను టిడిపికి దూరం చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ పాల్పడడంతో టిడిపి క్రియాశీలక కార్యకర్తలు స్తబ్దంగా ఉన్నారు. త్వరలోనే కామారెడ్డి జిల్లాలో భారీగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లా టిడిపి పార్టీ కృషి చేస్తుందని పేరు చెప్పని సీనియర్ నాయకులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదే శం పార్టీ 2019 ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుందన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు టిడిపి మద్దతు తెలిపితేనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్న విషయాన్ని మరిచిన కెసిఆర్ టిడిపి నాయకులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి గుణ పాఠం చెప్పి టిడిపి పార్టీకి అధికారం కట్టబట్టేందుకు గ్రామ స్థాయిలో టిడిపి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కాని వాటి పేర్లు మార్చి కెసిఆర్ లబ్ద్దిపొందుతున్నారన్నారని టిడిపి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రజలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ సభను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం, టిడిపి కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కెసిఆర్ ప్రభుత్వానికి తగి న గుణపాఠం చెప్పితీరుతామన్న సంకల్పంతో తెలంగాణ టిడిపి నేతలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సభకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నార్ ఇజియస్ పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టడంతోనే ప్రస్తుతం తెలంగాణ అభివృద్దికి అది దోహద పడుతుందని ఇలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో అనేకం ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్ ప్రభు త్వం వాటినే కొనసాగిస్తుంది. రాబోయే ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు టిడిపి వైపు చూస్తున్నారని , ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబం ఏకాకి కావడం ఖాయమవడం జరుగుతుందని టిడిపి హెచ్చరించింది. రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడతో పాలన సాగిస్తున్నాడని, ప్రతిపక్షాల గొంతు నొక్కడంతో పాటు ప్రజలు స్వంత పార్టీ కార్యకర్తలను సైతం నిరాశ నిస్పృహలతో ఉండేలా ప్రభుత్వం పాలన సాగిస్తుందని టిడిపి నాయకులు ఏద్దేవా చేస్తున్నారు. కెసిఆర్ తన సొంత సర్వేలో ఉన్నవి లేనట్టు, లేనిది ఉన్నట్లు సర్వేల పేరిట కాలయాపన చేస్తూ ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్‌లను, ఎమ్మెల్సీలను భయభాంత్రులకు గురి చేస్తూ తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏది ఏమైనప్పటికీ కెసిఆర్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలల్లో భంగపాటు తప్పదని సర్వేలు చెబుతున్నప్పటికీ కెసిఆర్ తన సొంత సర్వేలు 120 స్థానాలకు గాను 120 స్థానాలు టిఆర్‌ఎస్ పార్టీకే వస్తాయని చెబుతుండడం హాస్యాస్పదం అన్నారు. ఎవరికైనా, ఏ పార్టీకైనా ఏక పక్షంగా అధికారం కట్టబెట్టే చరిత్ర భారతదేశ రాజ్యాంగంలో లేదని టిడిపి వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో టిడిపి పార్టీకి మంచి రోజులు రానున్నాయని కామారెడ్డి జిల్లా టిడిపి నాయకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికార ఏర్పాటుకు గడప గడపకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

comments