Search
Monday 11 December 2017
  • :
  • :

ఇన్నింగ్స్ 870 పరుగులతో విజయం….

CRICKET

 

చెన్నై: అండర్-16 విభాగంలో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై బీహార్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. బీహార్  జట్టు ఇన్నింగ్ 870 పరుగల తేడాతో గెలుపొందింది. ఇప్పటి వరకు ఇంత భారీ విజయం ఎప్పుడు నమోదు కాలేదు. అరుణాచల్ ప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 83 పరుగులకే ఆలౌటైంది. బీహార్ టీమ్ బ్యాటింగ్ లో విధ్యంసం సృష్టించి ఏడు వికెట్ట నష్టానికి 1007/7 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. బీహార్ బ్యాట్స్ మెన్లలో బిన్నీ(358), ప్రకాశ్(220) పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అరుణాచల్ ప్రదేశ్ 54 పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాట్స్ మెన్లు రూపంలో పెవిలియన్ కు చేరారు.

 

 

Comments

comments