Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

పడవ బోల్తా : 13మంది మృతి

BOAT

సియోల్ : యల్లో సముద్రంలో పడవ బోల్తా పడి 13 మంది మత్స్యకారులు చనిపోయారు. మరో ఏడుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు గల్లంతయ్యారు. సముద్రంపైకి చేపల వేటకు వెళ్లి పడవ ఒకటి పెట్రోలియం ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 20 మంది మత్స్యకారులు, ఇద్దరు నావికులతో వెళుతున్న పడవ 336 టన్నుల బరువైన పెట్రోలియం ట్యాంకర్‌ను ఆదివారం ఉదయం ఢీకొట్టిందని, ఈ ఘటనలో 13 మంది చనిపోగా, మరో ఏడుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. పడవ కెప్టెన్‌తో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవలో ప్రయాణిస్తున్న వారు లైఫ్ జాకెట్లు ధరించినప్పటికీ శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చనిపోయారని అధికారులు తెలిపారు.

Boat Roll Over in Sea : 13 People died

Comments

comments