Search
Monday 11 December 2017
  • :
  • :

బ్రోకర్లే కింగ్ మేకర్లు

house

*సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాల దందా
*పాస్‌బుక్కులు లేకుండానే రిజిస్ట్రేషన్లు

మన తెలంగాణ/తాండూరు: వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న తాం డూరు పట్టణంలోని రియల్ వ్యాపారం సైతం పెరిగింది. తాండూరు పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్లాట్లకు సైతం విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనిని అదునుగా చేసుకున్న రియల్ వ్యాపారులు అక్రమ రిజిస్ట్రేషన్‌లకు తలపడుతున్నారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ దందా కొనసాగుతుంది. రోజుకు కోట్ల రూపాయల విలువైన భూములు ఇక్కడ రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి. ఓ పక్క ప్లాట్లు మరో పక్క గ్రామాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌లు కొనసాగుతున్నాయి. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందే బ్రోకర్‌ల హవా కొనసాగుతుంది. బ్రోకర్ ద్వారా వెళ్లిన ప్లాట్‌లు, భూ ముల మాత్రమే రిజిస్రేషన్ట్ అవుతున్నాయి. ఉన్న సబ్ రిజిస్ట్రార్ సైతం బ్రోకర్‌లను నమ్ముకున్నారు. దీంతో ఇక్కడ బ్రోకర్‌లే కింగ్ మేకర్‌లు అవుతున్నారు.  తాండూరు సబ్ రిజిష్టార్ కార్యాలయంలో రోజు సంఖ్యలో రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి.అయితే భూ ముల విక్రయాలలో పట్టా పాసుబుక్కు లేనిదే భూమి రిజిస్ట్రేషన్ చేయరాదు.అయితె రైతులకు  ఉన్న పాస్‌బుక్కులు బ్యాంకుల వద్ద తాకట్టు ఉన్నా పాస్ బుక్ లేనిదే భూముల రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది.ఇందు కోసం ఎకరానికి రూ,20 వేల నుండి రూ.30 వేలు సబ్‌రిజిష్టార్ కార్యాలయానికి ముట ్టజెప్పుతున్నారు.బ్యాంకుల వద్ద తాకట్టు ఉన్న పాస్ బుక్కులో ఉన్న భూమి వివరాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.దీంతో రైతు విక్ర యించిన భూమిపై కూడా బ్యాంకులలో అప్పులు తీసుకుం టున్నారు.నిబంధనలు పాటించని సబ్ రిజిష్టార్ ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు.మరో పక్క రియల్ వ్యాపారం బాగా కొనసాగుతున్న తాండూరు ప్రాంతంలో ప్లాట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి.విక్రయిస్తున్న ప్లాట్లకు లింక్ డాక్యుమెంట్,లే అవుట్,ఎన్‌ఓసి,సర్వే నెంబర్‌లు లేకండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి రియాల్టర్‌లు విక్రయిస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండానే సబ్ రిజిష్టార్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.ప్రతి ప్లాటు వద్ద సుమారు రూ.50 వేలు మామూళ్లు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు.దీంతో ప్లాట్లు కొనుగోళు చేసిన లబ్దిదారులు అనుమతుల కోసం ము న్సిపల్ కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు వెలసిన బ్రోకర్‌లు ఇందుకు పాల్పడుతున్నారు.ప్రతి రోజు ఇదే తంతు కొనసాగుతున్న సబ్‌రిజిషార్ మాత్రం పట్టించుకోవడం లేదు.తాండూరు పట్ఠణ పరిధిలోని తులసి నగర్,గొల్ల చెరువు,ఇందిరానగర్ ,మాణిక్ నగర్‌లతో పాటు మున్సిపల్  పరిసరాలలైన అంతారం, కోకట్, గౌతాపూర్, కందనెల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్‌లు గోల్‌మాల్‌గానే కొన సాగుతున్నాయి. తాండూరు సబ్ రిజిష్టార్ కార్యాలయం పూర్తిగా బ్రోకర్‌ల చేతుల్లో కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్ రిజిష్టార్ కార్యాలయంలో కొనసాగుతున్న అక్రమ దందాను అడ్డుకోవాలని లబ్ధిదారులకు నేరుగా రిజిస్ట్రేషన్‌లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments