Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

నిద్రలోనూ బరువుపెరుగుతారా?

Harivillu-image

తెగతింటే బరువు పెరిగిపోతామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అధికాహారం వల్ల బరువు పెరగడం కన్నా కొవ్వుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువుపెరుగుతారు. స్వీట్లు అధికంగా తింటే బరువెక్కిపోతారు. పళ్ళు చెడగొట్టుకుంటారు. చాలా మందికి అంతగా అవగాహన లేని విషయమేమిటంటే నిద్రలోనూ మనుషులు లావెక్కిపోతారు. ఇది మనకు తెలిసి జరిగే ప్రక్రియ కాదు కనుక తెలియకుండానే బరువెక్కిపోతుంటాం. సాధ్యమైనంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనుకున్నా..అనవసరంగా బరువు పెరగకూడదనుకున్నా ఈ అలవాట్లను మానుకోండి..
చాలా తక్కువసేపు నిద్రపోవడం : చాలా తక్కువసేపు నిద్రపోవడం వల్ల బరువు పెరిగిపోతారు. మొత్తంగా ఇది జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రక్రియ బాగా నెమ్మదిస్తుంది. ఇందువల్ల బరువు పెరగడం మొదలవుతుంది. దీనికితోడు విపరీతమైన ఆకలి కూడా వేస్తుంది. మీ శరీరం ఉత్పత్తిచేసే కార్టిసాల్ ని విపరీతంగా పెంచుతుంది. తక్కువసేపు నిద్రపోయేవారు తక్కువసేపు శారీరక వ్యాయామం చేస్తారు. అలసిపోయినట్లు ఉంటారు. కనుక రాత్రిపూట కనీసం 78 గంటలు పడుకోవాలి.
రాత్రిపూట ఎక్కువగా తినడం : రాత్రిపూట అవసరానికి మించి ఆహారం తీసుకుంటే విపరీతంగా బరువు పెరుగుతారు. ఎక్కువ ఆహారం తీసుకున్నా లేక ఎక్కువగా అనిపించే ఆహారం తీసుకున్నా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. టి.వి ముందు కూర్చొని తినడం మానేయండి. అలా తింటే ఏం తింటున్నారో..ఎంత తింటున్నారో తెలియదు. తింటున్న ఆహారంపై నియంత్రణ తప్పకుండా ఉండాలి. ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరో డైట్ బెస్ట్
తినీ తినగానే పడకేయకండి : రాత్రిపూట ఆహారం తీసుకున్న వెంటనే చాలామంది పడకెక్కేస్తుంటారు. తిండికీ, నిద్రకీ మధ్యలో ఏ పనీ చేయరు. ఈ చెడ్డ అలవాటు వల్ల శరీరంలో విపరీతంగా కొవ్వు పెరిగిపోతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవదు. తినడానికి..పడుకోవడానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
ఫ్రై తినటం మానాలి: రాత్రిపూట వేయించిన ఆహారాలు తీసుకోవడం ఒంటికి మంచిది కాదు. ఎన్నో కేలరీల శక్తి వస్తుంది.. కానీ..ఖర్చు కాదు. ఇందువల్ల కొవ్వు పేరుకుపోతుంది.నిద్ర కూడా సరిగా పట్టదు.
కారా తినడం మానాలి : రాత్రి పూట మరీ ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. కొంత మంది కారం కారంగా తినాలనిపిస్తోంది బాగా కారంగా ఉండే ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటారు. అలాగే మరికొందరు కిక్ అంటూ పచ్చిమిరపకాయలు నంచుకుతింటుంటారు. ఆవకాయలోనూ మిరపకాయలు నంచుకునే వారున్నారు. ఇలా బాగా కారంగా తింటే అవి సరిగ్గా అరగవు. అందువల్ల సరిగ్గా నిద్రపట్టదు. న్యాయంగా 78 గంటలు నిద్రపోయే పరిస్థితి ఉన్నా చాలా గంటలు ఏమి తినకుండానే ఉంటాం. కనుక బాగా కారంగా ఉన్న ఆహారాల వల్ల పొట్టలో ఉన్న ఆమ్లాలు అధికంగా బైటికి వస్తాయి. అందువల్ల విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. కారంగా తినదలచుకుంటే అది పగటిపూటే చేయండి.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం వద్దు : శరీరానికి కావాల్సినంత శక్తిని ఇవ్వడమే కార్బోహైడ్రేట్స్ ముఖ్య ఉద్దేశ్యం. పడుకునేటప్పుడు ఎవ్వరికీ ఇంత శక్తి అవసరం ఉండదు. కార్బొహైడ్రేట్స్‌లో శుద్ధి చేసిన చక్కెర పదార్ధాలు చాలా ఉంటాయి. వాటిని వెంటనే ఖర్చు చేయాలి లేదంటే కొవ్వుగా మారిపోతాయి.
స్వీట్లు..ఐస్ క్రీంలు వద్దు : చక్కెర..శుద్ధి చేయని పిండి..కొవ్వు రూపంలో కణాలలో పోగవుతాయి. అందువల్ల వీటిని సాయంత్రం తినటం అనే ఆలోనే మంచిది కాదు. వీటి వల్ల లభించే క్యాలరీలను మన శరీరం వెంటనే ఖర్చు చేయలేదు వీటికి బదులుగా మంచి పళ్ళను సేవించడం మంచిది. ఇవి మామూలుగానే తియ్యగా, రుచికరంగా, పోషకాలతో కొవ్వులేకుండా కూడా ఉంటాయి.
చిరు తిండ్లు : రాత్రిపూట చిరు తిండ్లు అస్సలు తినకండి. చాలా మంది రాత్రిపూట ఆహారం తీసుకున్న తరువాత, ఫ్రిడ్జ్ లోనో లేదా అరల్లోనో చిరు తిండ్ల కోసం వెతుకుతుంటారు. ఇది మంచిది కాదు. వీటి వల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. రాత్రిపూట అవి అస్సలు ఖర్చు కావు. అధిక శక్తి లభించడం వల్ల కూడా నిద్ర సరిగ్గా పట్టదు. ఇంత హెవీలోడును శరీరం సక్రమంగా వినియోగించుకోలేదు. ఇవి ఖచ్చితంగా శరీర బరువుని పెంచుతాయి.
రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం : రాత్రిపూట ఆహారం తీసుకోక పోవడం సరైన ఆలోచన కాదు. ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గొచ్చేమో గాని, దానితోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగించే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆహారం తీసుకునే సమయంలో ఆకలి మరింతగా పెరుగుతుంది. యాంగ్జైటీ పెరుగుతుంది. ఇది నిద్రను దెబ్బతీస్తుంది. అసలే ఆహారం తీసుకోకపోవడం వల్ల కండ తగ్గిపోయి కొవ్వు పెరిగిపోతుంది.
కాఫీ..లిక్కర్ కరెక్ట్ కాదు : కాఫీని పొద్దుట తాగండి. మద్యాన్ని..కాఫీ ని నిద్రపోయే ముందు ముట్టుకోకండి. అవి నిద్ర పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ రెండిటిలోనూ అధిక క్యాలరీలుంటాయి. నిద్రకు భంగం కలిగిస్తాయి. బరువు పెంచుతాయి. వీటి బదులు ఒక కప్పు గోరువెచ్చని పాలని గానీ, గ్లాసు నీటినికానీ తీసుకోవడం తెలివైన పని.
మొబైల్ కంప్యూటర్ వాడకండి : సెల్ ఫోన్, కంప్యూటర్ తెరల నుండి వెలువడే నీలి కాంతి.. రేడియో తరంగాలు నిద్రను దెబ్బతీస్తాయి. ఆరోగ్యవంతమైన బరువుని నిర్వహించడం కష్టం అవుతుంది. కనీసం గంట ముందు నుంచీ వీటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. దీనికి బదులుగా మంచి పుస్తకాన్ని చదవండి లేదా మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి.
చాలా ఆలస్యంగా నిద్రపోవడం : చాలా ఆలస్యంగా నిద్రపోవడం అనేది మంచి అలవాటు కాదు. రాత్రి ఒంటి గంట తర్వాత పడుకుంటే విపరీతమైన బరువు పెరుగుతారు. నిద్ర రప్పించుకోడానికి పోరాటం చేయాల్సి ఉంటుంది కనుక ఈ స్ట్రగుల్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

Comments

comments