Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

అమ్మా నాన్న అడక్కుండానే అన్నీ ఇచ్చారు

Chaloనాగశౌర్య కథానాయకుడిగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో’. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శంకరప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో సినిమాలోని ‘చూసి చూడంగానే…’ అనే పాటను రిలీజ్ చేశారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘చూసి చూడంగానే.. పాటను మహతి అద్భుతంగా కంపోజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ పాటలో నాగశౌర్య, రష్మిక మండన్న చాలా అందంగా కనిపిస్తారు. యూట్యూబ్ లో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ పాటకు పాజిటివ్ కామెం ట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది’ అని అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు బ్యాక్‌బోన్ కెమెరామెన్ సాయిశ్రీరామ్. మమ్మల్ని సినిమాలో బాగా చూపించారు. మణిశర్మ తనయుడు మహతి సాగర్ సినిమాకు అద్భుతమైన పాటలను అం దించారు. ఇక మా అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి ఏమీ అడక్కుండానే నాకు అన్నీ చేశారు. సినిమా తీయమని నేను అడగలేదు. ఇప్పుడు కూడా అడక్కుండానే సినిమా చేస్తున్నా రు. నేను నమ్మిన స్క్రిప్ట్‌నే నమ్మారు. అమ్మా, నాన్న, మా డైరెక్టర్, మా అన్నయ్య గౌతమ్, సాయిశ్రీరామ్‌లకు చాలా థాం క్స్’ అని చెప్పారు. చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ ము ల్పూరి మాట్లాడుతూ ‘సినిమా పాటకు అద్భుతమైన స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఐరా క్రియేషన్స్ సంస్థ తొ లి చిత్రంగా వస్తున్న ‘ఛలో’ మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది’ అని తెలిపారు. నరేష్, పోసాని, ర ఘుబాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్ తదితరులు ము ఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్: రామ్ అరసవిల్లి, డ్యాన్స్: రఘు, విజయ్.

Comments

comments