Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్

సిసి టీవీల్లో  రికార్డయిన దృశ్యాలు
అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం

                       Cheddi-Gang

మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. దారి దోపిడీ చేసి అందిన కాడికి దోచుకునే ఈ ము ఠా నగరంలోకి ప్రవేశించినట్టు పోలీసులు గు ర్తించారు. ఈ ముఠా సభ్యులు ముఖ్యంగా సైబ రాబాద్ పరిధిలోని మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో తిరుగుతున్న దృశ్యాలు సిసిటివి ఫు టేజ్‌లలో నమోదయ్యాయి. దీంతో సైబరాబా ద్, నగర, రాచకొండ పోలీసులు అప్రమత్తమ య్యారు. ఓ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న కూ కట్‌పల్లి పోలీసులు సిసి టీవీ ఫుటేజీలను పరిశీ లించేటప్పుడు ఈ గ్యాంగ్ సభ్యులు ఆయుధాల తో సంచరించడం కనిపించింది. దీంతో కూకట్ పల్లి, మియాపూర్ పోలీసులు విచారణ చేపట్టా రు.

చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ము సుగు వేసుకున్న ఈ గ్యాంగ్‌లో నాలుగు నుంచి ఏడుగురు సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్ప టివరకు బెంగళూరు, మహారాష్ట్రల్లో దోపిడీలకు పాల్పడ్డ ముఠా తాజాగా నగరంలోకి వచ్చింది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ టార్గెట్ అని పోలీసులు తెలిపా రు. సిసి టీవీ దృశ్యాలను ఆయా ప్రాంతాల్లో చూపించి స్థానికులకు అవగాహన కల్పిస్తున్నా రు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తి రుగుతున్న వారి గురించి సమాచారం అందిం చాలని సూచించారు. నగర వాసులను జాగ్రత్త గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గస్తీని పెంచాం : క్రైమ్ డిసిపి జానకీషర్మిల

చెడ్డీ గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించినట్లు తమకు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసుల తో పాటు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశాం. ముఖ్యంగా మియాపూర్, కెపిహెచ్‌బికాలనీ, కూకట్‌పల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ తిరిగినట్లు సిసిటివి ఫుటేజ్‌లు లభించ డంతో రాత్రి వేళ్లలో గస్తీని పెంచాం. ఆయా పోలీసు స్టేషన్‌లో సిబ్బంది రాత్రి సమయంలో సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ గ్యాంగ్‌ను పట్టుకుంటామన్నారు.

Comments

comments