కరీంనగర్‌ప్రతినిధి: రెండు రోజు ల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధ వారం సాయంత్రం 5.00 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. తీగలగుట్టపల్లిలోని హెలిప్యాడ్ వద్ద పార్టీ ముఖ్య నాయకులతో పాటు, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి నేరుగా ఉత్తర తెలంగాణ భవన్ చేరుకున్న ము ఖ్యమంత్రి రాత్రి అక్కడ బస చేయనున్నారు. గురువారం ఉదయం 9.00 గంటలకు ఉత్తర తెలం గాణ భవన్ నుండి బయలు దేరి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న తుపాకుల గూడెం బ్యారేజ్‌ను సంద ర్శిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఆయన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తారు. అనంతరం కన్నెపల్లి, పంప్ హౌజ్, అన్నవరం బ్యారేజ్‌లను, సిరిపురం పంప్ హౌజ్ పనులను పరిశీలిస్తారు. సిరిపురం పంప్ హౌస్ వద్ద భోజన విరా మనంతరం సుందిళ్ల బ్యారేజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం గోలి వాడ, పంప్‌హౌజ్ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. గురువారం రాత్రి ఆయన రామగుండం ఎన్టిపిసిలో బస చేస్తారు. శుక్రవా రం ఉదయం 9.00 గంటలకు ఎన్టిపిసి నుంచి బయలుదేరి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద ప్యా కెజీ 6లో భాగంగా నిర్మిస్తున్న పంప్ హౌజ్‌ను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ వద్ద ప్యాకెజీ 8లో భాగంగా నిర్మిస్తున్న పంప్ హౌజ్, సర్జ్‌పూల్ పనులను పరివేక్షిస్తారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామ్‌పూర్‌లో నిర్మిస్తున్న పంప్ హౌజ్ పనులను పరిశీలించిన అనంతరం మిడ్ మానేర్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.