Search
Friday 20 April 2018
  • :
  • :

సిద్ధారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

christ
మనతెలంగాణ-సత్తుపల్లిరూరల్
మండల పరిధిలోని సిద్ధారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీ, సోదరులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మతమేదైనా కావచ్చు, అన్నీ మతాలు జనహితాన్నే కోరుకుంటున్నాయని, క్రీస్తు చూపిన మార్గంను ప్రేమించాలన్నారు. అనంతరం క్రైస్తవ గీతాలను ఆలపించారు. మోరంపూడి ప్రసాద్ దంపతులను నూతన వస్త్రాలతో సత్కరించారు. పాఠశాల విద్యార్థులు క్రిస్మస్ తాత వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యం, మోరంపూడి ప్రసాద్, నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కన్వీనర్ అలవాల కరుణాకర్, పాష్టర్‌లు యాకోబు, ప్రేమ్‌రాజు, జాషువా, దానియేలు, రాధాకృష్ణ, రూబేను, జాన్‌మార్క్, నాగాచారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments