Search
Wednesday 21 February 2018
  • :
  • :

కరీంనగర్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన సిఎం

cm

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మి స్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు బుధవారం రాత్రి కరీంనగర్‌కు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గు రువారం ఉదయం 9.50 ని॥లకు కరీంనగర్ నుండి హెలికాఫ్టర్‌లో కా ళేశ్వరం బయలుదేరి వెళ్లారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పరిశీ లనలో భాగంగా బుధవారం సాయంత్రం 5.15 గంటలకు తీగలగుట్ట పల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. రాత్రి బస అనంతరం ఉదయం జిల్లాకు చెందిన  రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మాత్యులు ఈటెల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మాత్యులు హరీష్‌రావు, ప్రభుత్వ విప్ కొప్పుల ఈ శ్వర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బి. వినోద్ కుమార్, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్, డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి రెండు హెలికాప్టర్‌లో వెళ్లారు. తెలంగాణ భవన్‌లో ఉదయం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్, నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమీషనర్ శశాం క్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు ముఖ్యమ ంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి తుపాకుల గూ డెం,మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బ్యారేజ్ పనులను కన్నెపల్లి, శ్రీపు రం, గోలివాడ పంప్ హౌజ్ పనులను ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం రామగుండం ఎన్టీపిసి అతిథి గృహంలో రాత్రి బస చేయనున్నారు. శుక్ర వారం సిఎం కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పరిశీలనలో భా గంగా మేడారం, రామడుగు, మల్యాల మండలంలో కొనసాగుతున్న పంప్ హౌజ్ పనులను, సొరంగ నిర్మాణ పనులను పరిశీలించనున్నా రు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మధ్యాహ్నం మద్యమానేరు పరిశీలించి సా యంత్రం నేరుగా హైదరాబాదు బయలుదేరి వెళ్లనున్నారు.

Comments

comments