Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

కోటి ఎకరాలకు నిరందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యం

look
మన తెలంగాణ/కోహెడ : తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడమే సిఎం కెసిఆర్ లక్షమని కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్ ఆన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాంచంద్రాపూర్ గ్రామంలో మిడ్‌మానేరు నుంచి గండిపల్లి, గౌరవెల్లికి ప్రాజెక్టు వరకు జరుగుతున్న వరద కాలువ నిర్మాణ పనులను హుస్నాబాద్, మానకొండూర్, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ కుమార్, రసమయి బాలకిషన్‌లతో కలిసి పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్ల్లాడుతూ నీళ్ళు, నిధుల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్ళ కోసం సిఎం కెసిఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అందుకోసం ప్రాజెక్టుల నిర్మణాలపై సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నా అనుమతులు వస్తున్నాయన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. హుస్నాబాద్ వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధికి సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌లు కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి మిడ్‌మానేరు నీటితో గండిపల్లి, గౌరవెళ్ళి ప్రాజెక్టును నింపి హుస్నాబాద్ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. వారి వెంట కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దల చంద్రయ్య, ఎంపిపి ఉప్పుల స్వామి, జడ్పీటిసి పొన్నాల లక్ష్మన్, నాయకులు కర్ర శ్రీహరి, పేర్యాల దేవేందర్‌రావు, రవీందర్‌రావు, సర్పంచ్ దొమ్మట జగన్‌రెడ్డి, జిల్లా నాయకులు బీంరెడ్డి రాజిరెడ్డి, బస్వరాజు రాకేశ్, శ్రీనివాస్‌రెడ్డి, పర్శరాములు గౌడ్ తదితరులు ఉన్నారు.

Comments

comments