Search
Sunday 21 January 2018
  • :
  • :

అభివృద్ధి బాటలో కాల్వశ్రీరాంపూర్ సహకార సంఘం

smileమనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్ : జిల్లాలోనే కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం అభివృద్ధి బాటలో పయనిస్తుందని సింగిల్ విండో చైర్మెన్ వంగళ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు.గురువారం మండలంలోని గంగారం పంచాయితీ ఆవరణలో గల ఊషన్నపల్లిలో సహకారం సంఘం ఆధ్వర్యవలో నగదు రహిత లావాదేవీలపై రైతులకు,సంఘం సభ్యులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 127 సహకార సంఘాలు ఉన్నాయని అందులో మన సంఘంలోనే ఏటిఎం నెలకొల్పొమన్నారు.రైతులు డబ్బుపొదుపు చేయడంపై దృష్టి సారించాలని,అవసరమైనవాటికి మాత్రమే లోన్లు తీసుకొని వాటికే ఉపయోగించాలన్నారు.సహకార సంఘం బ్యాంక్‌ల్లోనే సభ్యులకు ప్రశ్నంచే హక్కు ఉంటుందన్నారు.కిసాన్ కార్డులను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని వాటి ద్వారా డబ్బులు,జమ,తీసుకోవడం జరుపవచ్చారన్నారు.ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకంలో 18సం॥ నుండి 50 సం॥లోపు గల సభ్యులు రూ 350 చెల్లించుతే ప్రమాదవశాత్తు,సాధారణ మరణానికైనా రూ॥ 4 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు.అదేవిధంగా సురక్షజ్యోతి పథకంలో 50 సం॥ నుండి 70 సం॥ లోపు వారు రూ॥ 12 చెల్లిస్తే ప్రమాదవశాత్తు 2 లక్షలు,అంగవైకల్యం ఏర్పడితే రూ॥ లక్ష భీమా వర్తిస్తూందన్నారు.ఏటిఎంను వాడిన ప్రతి సభ్యుడికి లక్ష ప్రమాధ భీమా వర్తివసుందన్నారు.సోసైటి కల్పంచే వసతులను సభ్యులు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కొనుకటి మల్లారెడ్డి,వైస్ చైర్మెన్ ముస్క తిరుపతి,డైరెక్టర్ రానవేన రామస్వామి,డిజిఎం మురళీధర్‌రావు,ఫీల్డ్ ఆఫిసర్ మాజీ ఉపసర్పంచి ముష్కే రవి తదితరులున్నారు.

Comments

comments