Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

రైతుల జీవనోపాధికి కృషి

sdp

ములుగు ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌లో రైతుల జీవనోపాధిపై అధికారులతో కలెక్టర్ సమీక్షా

ములుగు: గజ్వేల్ నియోజక వర్గంలోని రైతులకు జీవనోపాధిని మెరుగు పరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రిటైర్డ్ చీఫ్‌సెక్రెటరీ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. ములుగు మండలంలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌లో బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, హార్టికల్చర్ శాఖ డిడి రామలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవన్‌కుమార్ లతో కలిసి గజ్వేల్ నియోజకవర్గంలో కూరగాయల పెంపకం భారీ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలు, సాధ్య అసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి ప్రభుత్వం సహాయ పథకాలతో జిల్లాలోని రైతులకు కూరగాయల పెంపకానికి రైతు లకు అందిస్తూన్న ప్రోత్సాహన్ని వివరించారు. జిల్లాలోని రైతుల జీవనోపాధి మెరుగుపరిచేలా ప్రత్యేకచర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు అధిక కూరగాయల పంటలు పండిస్తు న్నారని ప్రభుత్వం కూరగాయల పంటలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని అందుకుగానూ హార్టికల్చర్ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇస్తూ భూసార పరీక్షలు చేపడుతున్నారని తెలిపారు. రైతుల జీవనోపాధి కోసం ప్రభుత్వం మరింతగా కృషి చేస్తూందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ విషయమై స్వచ్చంద సంస్థ -ప్రభుత్వ సహాయ పథకాలతో ఉన్న కూరగాయల పెంపకం రైతులకు ప్రోత్సాహంగా జీవనో పాధిని మెరుగు పర్చడానికి ఉద్దేశించిన అంశాల గురించి రిటైర్డ్ సీఎస్ ప్రదీప్ చంద్ర ఆరా తీశారు ఈ కార్య క్రమంలో ఎన్‌జిఓ యుఎన్‌డిపి దిశా సంస్థ డైరెక్టర్ దివ్య, తహసీల్దార్ నాగమణి తదితరులు పాల్గొన్నారు

Comments

comments