Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రైతుపై చేయి చేసుకున్నకలెక్టర్ గన్‌మెన్లు

Ronald-Ross

మహబూబ్‌నగర్: జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల వద్ద కలెక్టర్ రోనాల్డ్‌రాస్ గన్‌మెన్‌లు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక రైతుపై చేయి చేసుకున్నారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్‌ను రోడ్డుపై నడిపారంటూ రైతును కొట్టారు. పొలంలో పనిచేస్తున్న రైతుపట్ల కలెక్టర్ వద్దకు రావాలంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో అకారణంగా రైతును కలెక్టర్ గన్‌మెన్లు కొట్టారంటూ స్థానిక రైతులు, కూలీలు ఆరోపించారు. గెన్‌మెన్లతో పాటు కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే కలెక్టర్, గన్‌మెన్లు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ వాహనం టైర్లలో గాలి తీసేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతుల ఆందోళన మధ్యే కలెక్టర్ రోనాల్డ్ రాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో రైతులు డిపిఆర్‌ఒ, తహసీల్దార్ వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు.

Comments

comments