Search
Monday 23 April 2018
  • :
  • :

వ్యాపారులు మోసాలకు పాల్పడితే ఫిర్యాదు చేయండి: జెసి

speak

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: ప్రజలు బజారులో ఖరీదు చేసే వస్తు వులపై మోసాలు చేసినట్లు గుర్తిస్తే వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యా దు చేయాలని జేసి సురేందర్‌కరణ్ పేర్కొన్నారు. జాతీయ వినియోగ దా రుల దినోత్సవం సందర్భంగా  శనివారం స్దానిక సాయిగార్డెన్స్‌లో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అమాయకత్వా న్ని నిరక్షరాస్యతను ఉపయోగించుకొని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారని, దీనిని ఎంత మాత్రం నిర్లక్షం చేయకుండా జాగ్రత్త తీసుకో వాలన్నారు. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కొలతలు , ధరలు  పరి శీలించి తేదిలు సరిచూసుకోవాలన్నారు. మోసం చేసినట్లు గుర్తిస్తే వెంట నే వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేస్తే సంబందిత వ్యాపారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా జరినామా విధిస్తారని, శిక్ష ఉంటుంద ని మనకు నష్ట పరిహారం లభిస్తుందని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేప టి పౌరులుగా ఉంటారని వారు తీర్చిదిద్దడానికి సమాజంలో ముందుం డాలని విద్యార్దులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబం ధాల అధికారి మోహన్‌బాబు, డిఆర్‌డిఒ సుధాకర్, జిల్లా తూనికల కొల  తల అధికారి సత్యనారాయణ,డిప్యూటీ డిఇఒ శ్రీధర్ తదితరులున్నారు.

Comments

comments