Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భూ ప్రక్షాళన 90 శాతం పూర్తి

PINK-POSTERమన తెలంగాణ/జుక్కల్: గత 90 రోజులుగా చేపడుతున్న భూ ప్రక్షాళన కార్యక్రమ ంలో కామారెడ్డి జిల్లాలో 90 శాతం పనులు పూర్తి అయ్యాయని కలెక్టర్ సత్యనారా యణ అన్నారు. శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో భూ ప్రక్షాళన పనులను పరిశీలించారు. పనులు ఏ విధంగా జరిగాయో అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఇప్పటి వరకు కొందరు అధికారుల తప్పిదం వల్ల పూజారుల పేరుపై దేవుడి భూములు రాశారని అవన్నీ దేవుడి పేరుతోనే రాయడం జరిగిందన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూముల సమస్య పరిష్కారం అయినట్లు ఆయన పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. వక్ఫ్‌బోర్డు భూములను పకడ్బందీగా గుర్తించామని వాటికి బోర్డులు రాయించి ఆ స్థలాల్లో పెడతామన్నారు. ప్రభుత్వ భూములకు కమిటీ వేశారన్నారు. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా పకడ్బందీగా చేపట్టడం జరిగిందని, రికార్డులన్నీ మ్యానువల్ పహాణీ లు, బందీలు రాయడం జరిందన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన జిరాక్స్‌లకు కావల్సిన డబ్బులు రెండు దఫాలుగా ఇచ్చామన్నారు. 8 లక్షల 35 వేల  భూములకు 4 లక్షల భూములు కరెక్టుగా ఉన్నాయని, అవన్నీ క్లియర్ చేశామన్నారు. మిగతా 4 లక్షల 80 వేల సర్వే నెంబర్ల వివరాలు కూడ నమోదు చేయడం జరిగిందన్నారు. లక్ష 40 వేల వరకు రైతులు భూ సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నవాటివి కూడా పరిష్కా రమయ్యాయన్నారు. ఓఆర్‌సిలను కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. లక్ష 33 వేల ఎకరాలు అసైన్డ్  భూములు ఉండగా, అందులో 12 వేల 300 ఎకరా లు టిఓటి కింద వచ్చాయి. ఇవన్నీ అప్‌లోడ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ నర్సింహా, తహసీల్దార్ శంకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments