Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఇంటింటి ఓటరు సర్వే పూర్తి

collector

*పాత జాబితాలోని 3,804 తొలగింపు, 2,971 నూతన ఓటర్ల నమోదు
*జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి: ఐఆర్‌ఇఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో నూతనంగా 2,971 ఓటర్లు నమోదయ్యారని జిల్లా కలెక్టర్ భారతిహోళ్ళికేరి తెలిపారు. గురువారం ఐఆర్‌ఇఆర్ కార్యక్రమంపై జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఆర్‌ఇఆర్ సర్వేకు ముందు మెదక్ పట్టణంలో 23,697 ఓట్లు ఉండేవని, ఇంటింటి సర్వే అనంతరం 22,864 ఓటర్లుగా గుర్తించడం జరిగిందన్నారు. పాత జాబితాలోని 3,804 ఓటర్లను బోగస్, మృతి చెందినవా రు, స్థల మార్పులు జరిగిన వాటిని తొలగించడం జరిగిందన్నారు. నూతనంగా 2,971 ఓటర్ల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సర్వే ద్వారా ప్రతి ఇంటిని గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల ప్రతి ఇళ్లు పోలింగ్ స్టేషన్ పరిధిలోకి సులువుగా గుర్తించడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమ సమీప పోలీంగ్ స్టేషన్‌లకు మార్చడం  జరిగిందని తెలిపారు. నూతన జాబిత, పోలీంగ్ స్టేషన్ల మార్పులకు సంబంధించిన కాపీలను ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ రాములు, ఆర్డీఓ నగేష్, తహసీల్దార్ యాదగిరి, డిటిలు నారాయణ, మహేందర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజనేయులు, గుడూరి అంజనేయులు, టిఆర్‌ఎస్ నాయకులు అరవింద్‌గౌడ్, టిడిపి నాయకులు అఫ్జల్, మాణిక్యరెడ్డి, సిపిఐ నాయకులు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలను చైతన్యపర్చాలి: కలెక్టర్ భారతి హోళికేరి
మండలంలో నిర్మించుకున్న మరుగుదొడ్లను ప్రతి ఒక్క రు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి అధికారులకు సూచించా రు. గురువారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇ ప్పటివరకు నిర్మించుకున్న మరుగుదొడ్లను జియోట్యాగింగ్ చేయాలని సూచించారు. అదే విధంగా నిర్మించుకున్న మరుగుదొడ్లను ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వివిధ కా ర్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో యువతను చైతన్యవంతం చేసి మరుగుదొడ్ల వాడకానికి ప్రత్యే క కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాపన్నపే ట మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధిం చి పూర్తి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రూర్బన్ పథకంలో భాగంగా ప్ర తి శాఖ పూర్తి స్థాయి డిపిఆర్‌తో పంపాలన్నారు. నామమాత్రంగా కాకుండా కావాల్సిన పనులకు సంబందిం చి పూర్తి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఏయే గ్రామంలో ఏయే పనులకు ఎన్ని నిధులు కావాలో తెలియజేయాలన్నారు. కొత్తపల్లి గ్రామంలో సీడ్ ప్రోసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని, మండలంలో 11 పిహెచ్‌సి సబ్ సెంటర్లకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రాగా పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

Comments

comments