Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

మణిశంకర్‌కు నీచ్ దెబ్బ

ph2

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెన్షన్

ప్రధాని మోడీని నీచ్ అన్నందుకు అధిష్టానం తీవ్ర ఆగ్రహం
క్షమాపణ చెప్పినా దక్కని ఫలితం

న్యూఢిల్లీ  :  కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ప్రధాని మోడీని నీచ్ అంటూ సంబోధించినందుకు కాంగ్రెస్ ఈ వేటు వేసింది. అయ్యర్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం రాత్రి కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రధానిపై వ్యాఖ్యలకు రాహుల్ ఆదేశాలతో మణిశంకర్ వెంటనే క్షమాపణలు కూడా కోరారు. గుజరాత్ ఎన్నికల దశలో అయ్యర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన అయ్యర్‌పై సస్పెన్షన్ చర్య తీసుకున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సమాచార విభాగం పర్యవేక్షకులు రణదీప్ సూర్జేవాలా విలేకరులకు తెలిపారు. గుజరాత్‌లో తొలి దశ ఎన్నికలు శనివారమే జరుగనున్నాయి. ఈ దశ పోలింగ్ జరిగే స్థానాలలో ప్రచారం గురువారం ముగిసింది. తమ పార్టీ గాంధేయవాద నాయకత్వ లక్షణాలను సంతరించుకుందని, రాజకీయ ప్రత్యర్థులను గౌరవించాలనే తత్వం తమ పార్టీది అని రణదీప్ చెప్పారు. ప్రధాని మోడీ తమ విధంగా చర్యలు తీసుకోగలరా? వెంటనే రాహుల్‌లాగా స్పందించగలరా? అని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్‌కు పార్టీ తరఫున ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ అయిందని, ఆయన వివరణ కోరామని, తక్షణ చర్యగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఈ ప్రతినిధి వివరించారు. అయ్యర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేవనెత్తిన విషయం, రాహుల్ వెంటనే స్పందించిన విషయం తెలిసిందే

Comments

comments