Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌ది కుల రాజకీయం: విహెచ్

VH

హైదరాబాద్: గాంధీ భవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బిసి డిక్లరేషన్ అంటూ కెసిఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సెంటిమెంట్ వర్క్ ఔట్ కాకపోవడంతో బిసి డిక్లరేషన్ అందుకున్నారన్నారు. క్రిమిలేయర్ గురించి కెసిఆర్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. సిఎం తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేసుకున్నారని విమర్శించారు. కేబినేట్‌లో నలుగురు మంత్రులు కెసిఆర్ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019 ఎన్నికల కోసమే కెసిఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం బిసిలకు చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు సిఎం కెసిఆర్‌కి బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

Congress Senior Leader V Hanumantha Rao Criticizes CM KCR.

Comments

comments