Search
Thursday 22 February 2018
  • :
  • :

2019లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

cong

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్న కేసిఆర్
టిపిసిసి హైపవర్ కమిటీ చైర్మన్ గండ్ర వెంకటరమణారెడ్డి

మనతెలంగాణ/భూపాలపల్లి ప్రతినిథి:
2019 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని టిపిసిసి హైపవర్ కమిటీ చైర్మన్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం రమణారెడ్డి మనతెలంగాణ ప్రతినిథితో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు టిఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ అధికారం చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మరోసారి టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రజలు రైతులు విద్యార్థులు టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని చూస్తున్నారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, వృద్ధాప్య పింఛన్ల విడుదల తదితర అంశాలపై మానిపెస్టో ఏర్పాటు చేసి ప్రజాశ్రేయస్సు దృష్టా పథకాల అమలు ఉంటుందని వెల్లడించారు. 2019 తర్వాత రాష్ట్రంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేవిధంగా హామీలు, పథకాల అమలు చేపడుతామని గండ్ర హామీ నిచ్చారు. రాష్ట్రంలో కేసిఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ప్రజల కోరిక మేరకే ప్రజాబలంతో రానున్న కాలంలో ప్రజాసమస్యలపై మరిన్ని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని సమయం వచ్చినప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వంకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గండ్ర హెచ్చరించారు.

Comments

comments