Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

వికలాంగుల మనోవికాసానికి తోడ్పండి

MIANISTR

రాష్ట్ర గృహ, నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్ : వికలాంగుల మనోవికాసానికి సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించడానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర గృహ, నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్మల్ పట్టణంలోని వైఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో వికలాంగుల సముచిత స్థానం కల్పిండంతో పాటు వారి మనోవికాసానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రూ. 500  ఉన్న పెన్షన్‌ను రూ. 1500కు పెంచిందన్నారు. వికలాంగుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నిర్మల్ జిల్లాలో 10559 మంది వికలాంగులకు ప్రతి నెల రూ. కోటి 58 లక్షల 38వేలు పెన్షన్ రూపంలో చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో 4436 మంది వికలాంగులతో 466 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి 354 సంఘాలకు రూ.2 కోట్ల 32 లక్షలు వివిధ పథకాల కింద అందించడం జరిగిందన్నారు. వికలాంగుల మనోవికాసానికి జిల్లాలోని సారంగపూర్, లకా్ష్మణచాంద, కుభీర్ మండలాల్లో మనోవికాస పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 94 మందికి అన్ని రకాల తెరపి సేవలను అందిస్తున్నామన్నారు. 10 సదరం క్యాంపులు నిర్వహించి 578 మందికి సదరం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు సంవత్సరంలో 150 పని దినాలు కల్పించడంతో పాటు 265 శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చేసి రూ. కోటి 19 లక్షలను చెల్లించడం జరిగిందన్నారు. జిల్లాలోని 99 ట్రైసైకిల్లు, 6 వీల్ చైర్లు, 83 చంక కర్రలు, 79 వినికిడి యంత్రాలు అందించడం జరిగిందన్నారు. సకలాంగులు వికలాంగులకు వివాహం చేసుకున్న 49 జంటలకు జంటకు రూ.50వేల చొప్పున రూ. 24.50లక్షలు మంజూరీ పత్రాలను మంత్రి అందజేశారు. రాష్ట్రస్థాయి వికలాంగుల పోటీల్లో గెలుపొందిన వారిని మంత్రి ఘనం గా సన్మానించారు. అనంతరం వికలాంగులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, చంకకర్రలు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. సకలాంగులు వికలాంగులకు వివాహం చేసు కుంటే రూ. 50వేల దివ్వాంగుల్లో నైపుణ్యత పెంపెందించే పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్, 4జీ స్మార్ట్ ఫోన్స్ రెట్రో ఫిటేడ్ మోటర్ వాహనాలు, వినికిడి యంత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అందిచనున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జెసి శివలింగయ్య, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణే ష్ చక్రవర్తి, నిర్మల్ ఎంపిపి దౌలన్‌బీ, పిఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ కాంత్రిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అజీంబిన్ యాహియా, మహిళ శిశు సంక్షేమ రిజినల్ ఆర్గనైజర్‌కస్తాల ప్రేమల, జిల్లా మహిళ శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి విజయలక్ష్మీ, డిఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, ఆర్‌టిఒ ప్రసూనంభ, కౌన్సిలర్లు గణేష్, రఫీ అహ్మద్ ఖురేషి, శకీల్, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సట్ట సాయన్న, ఎస్ సురేందర్, షేక్ అక్తర్, సాయినాథ్, నర్సింహచారి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments