Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వాసుపత్రులు

hall

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ఆధునీకరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్,  ఎంఎల్‌ఎలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ షిండే, కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, జిల్లా అధికారులతో ఆసుపత్రుల ఆధునీకరణ, డబుల్ బెడ్ రూమ్ వ్యవసాయంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 50 లక్షలతో ఇంటీరియర్ డెకరేషన్, ఔట్ పేషెంట్, బ్లాక్ ఎమర్జెన్సీ ఏరియా, ఓపెన్ ఏరియాలో కూర్చునే స్థలం, తదితర పనులను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 30 లక్షలతో ఔట్ పేషెంట్ స్థలం,  కారిడార్, ఎమర్జెన్సీ పనులను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. ఈ పనులను రెండు మాసాల్లో పూర్తి చేస్తామని డబుల్ బెడూ రూమ్ పథకానికి జిల్లాకు 6,436 ఇళ్లు మంజూరయ్యాయని, 3,868 టెండర్ దశలో ఉన్నాయ ని 1,837 ప్రారంభమయ్యాయని ఇందులో 40 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. సించాయి యోజన పథకం ద్వారా జిల్లాకు రూ. 4 కోట్ల 80 లక్షలు కేటాయించినట్లు         రూ. 2 కోట్ల 77 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. వీటితో 4 నియోజక వర్గాల్లో  సర్కులేషన్ ట్యాంక్స్ , చెక్‌డ్యామ్‌లు, బోర్‌వెల్స్ , ఫాంపాండ్స్ , పైప్ లైన్‌ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీను, రాజేశ్వర్, దేవేందర్ రెడ్డి, కామారెడ్డి ఏరియా ఆసుపత్రి కోఆర్డినేట్ అజయ్ కుమార్, బాన్సువాడ ఆసుపత్రి కో ఆర్డినేటర్ శ్రీనివాస ప్రసాద్, డిపివో గంగాధర్, వ్యవసాయ శాఖ అధికారి నాగేంద్రయ్య, ఇఇ పిఆర్ సిద్దిరాములు, పంచాయతీ రాజ్, అర్ అండ్‌బి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments