Search
Friday 20 April 2018
  • :
  • :

మంచిర్యాల రౌండప్: నెత్తురోడిన రహదారులు.. పెట్రేగిన అసాంఘీక కార్యకలాపాలు

accident

… కలచివేసిన రోడ్డు ప్రమాదాలు
…పెట్రేగిన దొంగలు, పెద్ద ఎత్తున చోరీలు
…పెరిగిన ఆసాంఘీక కార్యకలాపాలు
…హత్యలకు దారి తీసిన కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు
… పోలీస్ అధికారుల అక్రమాలపై బదిలీల వేటు
… ఎప్పటిలాగే మహిళలపై అకృత్యాలు, వరకట్నం వేధింపులు
… మంటకలిసిన మానవ సంబంధాలు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః
రహదారులు నెత్తురోడాయి. ఎంతో మంది ప్రాణాలను కోల్పోగా వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు కలసివేశారు. ఈఏడాది 105 రోడ్డు ప్రమాదాలు జరగగా. 125 మంది మంది ప్రాణాలను కోల్పొగా వేలాది సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరోవైపు కుటుంబ కలహాలు వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీశాయి. దొంగలు స్వైర విహారం చేయగా లక్షలాది రూపాయల్లో ప్రజల సొత్తు చోరీకి గురైంది. ఎప్పటిలాగే మహిళలపై అకృత్యాలు, వరకట్న వేధింపులు పెరిగిపోయాయి. పోలీసులు న్యాయం చేయడం లేదని మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వివిధ కేసుల్లో అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన పలువురు పోలీస్‌శాఖ ఉన్నతాధికాలపై బదిలీ వేటు పడింది. అదే విధంగా ఆసాంఘీక కార్యక్రమాలు, రియల్ మాఫియా అగడాలు పెరిగిపోయాయి. చట్టపరంగా పకడ్బంధి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు షీటీంలు ఏర్పాటు చేసిన , సిబ్బంది కొతర వలన రక్షణ కొరవడింది. ఈ ఏడాది 32 మందిపై లైంగిక దాడులు జరిగాయి. జిల్లాలో ఈ సంవత్సరం 105 రోడ్డు ప్రమాదాలు, 125మంది మృతి చెందగా , 1046 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల కుటుంబాలు వీదినపడగాఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని కలసి వేశాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం,మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రతినిత్యం ప్రమాదాలు జరిగాయి. పట్టణంలోని కళాశాల రోడ్డులో ఒక యువతి కన్నకుమార్తెను ఉరివేసి, ఆమె ఉరివేసుకొని మరణించడం పలువురిని కంటతడిపెట్టించింది. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల కారణంగా ఈ సంవత్సరం వివిధ కేసుల్లో 18 మంది హత్యకు గురికాగా 370 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన్ని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలంరేపాయి.

గత ఆగస్టు నెలలో మంచిర్యాల పట్టణంలోని శంకర్ (30) అనే యువకున్ని అతనితో కాపురం చేస్తున్న మహిళ ఆమె కొడుకుతో కలసి హత్య చేసిన సంఘటన కలకలంరేపింది. అదే విధంగా జులై నెలలో కాసిపేట మండలం పెద్దనపల్లికి చెందిన మార్త గట్టయ్య, అనే లారీ డ్రైవర్, మద్యానికి బానిసకాగా అతని కుమారుడు వేధింపులు భరించలేక బండరాయితో కొట్టి చంపిన సంఘటన హృదయవిదారకంగా మారింది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 278 చో రీలు జరిగాయి. ప్రధానంగా తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు పెద్దఎత్తున నగదు, నగలు ఎత్తుకెళ్లారు. పోలీసు అధికారులు పట్టణంలోని వేర్వేరు పట్టణాల్లో సిసి కెమెరాలను అమర్చినప్పటికి దోపిడి దొంగతనాలు ఏదావిధిగా కొనసాగాయి. ఈ జిల్లాలో తగాదాలు, గొడవల కేసుల్లో 37 మందికి తీవ్రగాయాలు కాగా 394 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈఏడాది 38 హత్యాయత్నం కేసులు, 209 షీటీం కేసులు, 9 నమ్మక ద్రోహం కేసులు నమోదయ్యాయి. ఏకంగా 167 మందిపై రౌడీషీట్లు తెలిరిచారు. జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిగా గుట్కా దందా యదావిధిగా కొనసాగుతుంది. మందమర్రి మండలం గద్దరాగడి వద్ద సుమారు 50 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది పోలీసుశాఖ ఉన్నతాధికారులు అవినీతి అక్రమాల కేసుల్లో ఇరుక్కొని బదిలీలకు గురయ్యారు. బెల్లంపల్లి ఏసిపి సతీష్‌పై ఏసిబి అధికారుల కేసు నమోదు చేయగా మంచిర్యాల ఏసిపి చెన్నయ్య,జైపూర్ ఏసిపి కవితతో పాటు పలువురు సిఐలు అవినీతి అక్రమాలకు పాల్పడి బదిలీపై వెళ్లారు. ఈఏడాది పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకుండానే గడిచిపోయింది.

Comments

comments