Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

దుర్భర జీవితాల్లో దళితులు

mantri

ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు కె.రాములు

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : స్వాతంత్య్రం వచ్చి 70సం॥లుగడుస్తున్నప్పటకి ఈ కంప్యూటర్ యుగంలో కూడా హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్నా, దేశంలో ఎక్కడలేని విధంగా యాదాద్రిభువనగిరి జిల్లాలో అక్కడక్కడ 2 గ్లాసుల విధానం కొనసాగడం బాధాకరమైన విషయమని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు కె.రాములు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అనంతారం గ్రామం, పట్టణంలోని దళితవాడలను శనివారం ఆయన కాలినడకతో పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపుతో నిండిన మోరీలు కనిపించడం, విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు లేకపోవడం, పెన్షన్‌లు రాని మహిళా కూలీలు ఉండడం బాధాకరమన్నారు. గ్రామంలోని దళితులతో సుదీర్ఘంగా మా ట్లాడారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ దేవసేన, జాయింట్ కలెక్టర్ రవినాయక్, ఆర్‌డీవో ఎంవి భూపాల్‌రెడ్డిలకు  ఆదేశించారు. అదేవిధంగా దళిత వి ద్యార్థుల సంక్షేమానికి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 20 లక్షల రూ॥లు ప్రభుత్వం అందిస్తుందని ఈ  సదవకా శాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ హాస్టళ్లలో మరుగు దొడ్లు , స్నానాల గదులు లేక బాలికలు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నా రని సం బంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నా రు. గ్రా మాల వారీగా ఐదుగురి చొప్పున కమిటీ సభ్యులను ఎంపిక చేసి ఎప్పటికప్పుడు సమస్యలు ఆ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఎస్సి సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చుచేయాలని అధికా రంగా ఆదేశించారు. ఆయన వెంట ఇన్‌చార్జి కలెక్టర్ దేవ సేన, జేసీ రవినాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావ ణ్య, వైస్ చైర్‌పర్సన్ బి.మహలక్ష్మీ, ఆర్‌డీవో ఎంవి భూపా ల్‌రెడ్డి,మండల తహసీ ల్దార్ కె.వెంకట్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్య క్షుడు పివి శ్యాం సుందర్‌రావ్, ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్,  మాజీ ఎంపీపీ ఎర్రకళమ్మ, టీ-మాస్‌ఫోరం జిల్లా చైర్మన్ భట్టు రాంచంద్రయ్య, న్యాయవాదులు కలకుంట్ల జ యమ్మ, వేముల అశోక్, నాగారం అంజయ్య, ఎమ్మార్పీఎస్ టిస్ రాష్ట్ర నాయకులు చిలకమారి గణేష్, పలు ప్రజా సంఘాల దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు.

Comments

comments