Search
Wednesday 23 May 2018
  • :
  • :

ముగిసిన మూడోరోజు ఆట.. శ్రీలంక 356/9

Sri-Lanka-Vs-India

న్యూఢిల్లీ: వేదికగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. కెప్టెన్ చండీమల్, సినీయర్ ఆటగాడు మాథ్యూస్ సెంచరీలతో లంకను ఆదుకున్నారు. 131/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. 231 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో మాథ్యూస్ శతకం నమోదు చేశాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో 111 పరుగులు చేసిన మాథ్యూస్.. అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో చండీమల్, మాథ్యూస్ 181 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కెప్టెన్ చండీమల్, సమరవిక్రమాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో చండీమల్ సెంచరీ నమోదు చేశాడు.

అయితే 33 పరుగులు చేసిన సమరవిక్రమా ఇషాంత్ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రోషన్ సిల్వా, డిక్వెల్లా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరగా.. లక్మల్(5), గమగె(1) కూడా వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో శ్రీలంక 343 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అయితే చండీమల్ నిలకడైన ఆటతీరుతో లంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు, షమీ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. పీచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో భారత బౌలర్లు వికెట్ పడగొట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. అంతకుముందు కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్‌ను 536 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో లంక ఇంకా 180 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో చండీమల్(147 బ్యాటింగ్), సందకన్(0 బ్యాటింగ్) ఉన్నారు.

Comments

comments