Search
Tuesday 19 June 2018
  • :
  • :

తనకు దక్కేలా లేదని ప్రియురాలిని చంపి..ఆపై

lovers
మనతెలంగాణ/ఇల్లంతకుంట
‘అమ్మనాన్న నన్ను క్షమించండి’..అన్నయ్యలు నేను వెళ్లిపోతున్న..నాలాంటి ఏ ప్రేమికుడికి ఇలాంటి సంఘటన ఎదురుకావద్దు..మా అమ్మకంటే ఎంతో ప్రేమగా నిన్ను ఇష్టాపడ్డాను కానీ నువ్వు నన్ను అంతగా ఇష్టపడడం లేదు అంటూ ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన ప్రియుడు వొళ్లాల మధు తను ఆత్మహత్య చేసుకునే కొన్ని సెకన్ల ముందు సెల్ఫీ విడియో లో చిత్రికరించి మృతి చెందాడు. మండలంలోని తాళ్లపెళ్లి శివారులోని ఓ ఫౌల్ట్రీ ఫాం లో అనంతారం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే వీరి ఆత్మహత్యకు ముందు ప్రియుడు తన భాదను సెల్పీవిడియో తీసి చిత్రికరించాడు. మేం ఇద్దరం ఓకే గ్రామానికి చెందిన వాళ్లం, గత కొన్ని సంవత్సరాలుగా సుష్మితను నేను ప్రేమిస్తున్న..నేను ఎప్పుడు మనం ఇద్దరం పెండ్లి చేసుకుందామని అడుగుతున్న మా అమ్మవాళ్లు ఓప్పు కోవడం లేదని చెప్పుతు వచ్చింది. దీంతో నాకు చాల కోపం వస్తుంది. నేను ఎన్ని సార్లూ చెప్పిన వినకపోవడంతో తన పై ప్రేమను చంపుకోలేక తనను నేను చంపెస్తున్న నన్ను క్షమించండి. ప్రియురాలిని తల్లికంటే ఎక్కువగ ఇష్టపడే ఏ ప్రియుడుకి ఇలాంటి పరిస్థితి రాకుడదు. ఆరేయ్ వంశీ స్వారి రా నేను వెళ్లిపోతున్న నీ పెండ్లి రోజే నా చావురోజైతుంది. నన్ను క్షమించురా.. మా చావుకు ఏవరు కారణం కాదు, అమ్మ, నాన్న, అన్నయ్యలకు నేను లేని లోటు ఉంటుంది నన్ను క్షమించండి. అంటూ విడియో తీసి మృతి చెందాడు. ఈ పూర్తి విడియోను మృతుల బందువులకు సిరిసిల్ల రూరల్ సిఐ అనిల్‌కుమార్ చూపించాడు. కానీ మీడియాకు ఎలాంటి విడియో రీలిజ్ చేయలేదు.
మృతదేహాలకు సిరిసిల్లలో పొస్టుమార్టం…
ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామానికి చెందిన వొల్లాల మధు, మిట్టపెల్లి సుష్మిత ప్రేమికులు ప్రియురాలిని చంపివేసి, ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో వీరిద్దరి మృత దేహాలకు సిరిసిల్లలో పొస్టు మార్ట నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో రెండు మృత దేహాలకు పొస్టుమార్టం నిర్వహించారు. మొదటగా పొస్టుమార్టం పూర్తయిన తర్వాత యువతి మృతదేహాన్ని స్వగ్రామం పంపించి దహనం చేశారు. తర్వాత ప్రియుడు మృత దేహాన్ని గ్రామంలో దహనం చేశారు. యువతి తల్లి ఫీర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్‌ఐ పాకాల లకా్ష్మరెడ్డి తెలిపారు.

Comments

comments