Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

నేడే ఆర్‌బిఐ నిర్ణయం

  గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎంపిసి సమావేశం

  వడ్డీరేట్ల యథాతథానికే మొగ్గు?

urjithన్యూఢిల్లీ: ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో ద్రవ్యవిధాన కమిటీ(ఎంపిసి) మంగళవారం రెం డు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీ రేట్లను ఈసారి తగ్గించే అవకాశం లేదని, ద్రవ్యోల్బణం నియంత్రణపైనే దృష్టిని కేంద్రీకరించిందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంపిసి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు నెలలో ఆర్‌బిఐ 0.25 శాతం వడ్డీ రేటు తగ్గింపుతో 6 శాతానికి చేరగా, ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి కావడం విశేషం. గత సమీక్షలోనే వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించిన సెంట్రల్ బ్యాంక్ రెండోసారి కూడా ఎలాంటి మార్పు చేయకపోవచ్చని బ్యాంకర్లు, నిపుణులు భావిస్తున్నారు. దీనికి కారణం వచ్చే నెలల్లో ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో రిజర్వు బ్యాంక్ నిర్ణయం ఆచితూతి తీసుకోనుందని, యథాతథంగానే రేట్లను కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ‘వడ్డీ రేట్లలో మార్పు లేకపోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత కనిష్ఠ స్థాయికి చేరగా, డిపాజిట్ రేట్లు పెరిగాయి. ద్రవ్యోల్బణం పై ఆందోళనలు నెలకొన్నాయి’ అని యూనియన్ బ్యాంక్ ఎండి, సిఇఒ రాజ్‌కిరణ్ రాయ్.జి అన్నారు. క్రెడిట్ రేటిం గ్ సంస్థ ఐసిఆర్‌ఎ కూడా ఆర్‌బిఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవచ్చని, వచ్చే నెల ల్లో రిటైల్ ద్రవ్యోల్బణం దృష్టా ఆరు శాతం వడ్డీ రేటే ఉండే అవకాశముందని పేర్కొంది. జూన్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండడంతో రెపో రేటును తగ్గించే అవకాశాలు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐఐపి (పారిశ్రామికోత్పత్తి సూచీ) కూడా మందగమనంలో సా గుతుండటం వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు లేకుండా చేస్తోంది. మో ర్గాన్ స్టాన్లీ, నోమురా తదితర సంస్థల విశ్లేషకులు కూడా రెండేళ్ల గరిష్టానికి  చేరిన ముడిచమురు ధరల నేపథ్యంలో యథాతథ పాలసీ అమలుకే ఎంపిసి మొగ్గుచూపవచ్చని అంచనా వేస్తున్నారు.  రెం డో త్రైమాసికంలో(జులై  సెప్టెంబర్)లో వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుని 6.3 శాతం నమోదైంది. అంతకుముందు మొద టి త్రైమాసికం (ఏప్రిల్‌జూన్)లో జిడిపి 5.7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక ద్రవ్యోలోటు ఆందోళన కల్గించేలా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201718) అక్టోబర్ ముగింపు నాటి ద్రవ్య లోటు 96.1 శాతం దాటింది. గత ఏడా ది ద్రవ్యలోటు రూ. 4.2 లక్షల కోట్లతో పోలి స్తే రూ. 5.25 లక్షల కోట్లుగా నమోదైంది. తక్కువ ఆదాయం, వ్యయాలు పెరిగిన కారణంగా దేశీయ ఆర్థిక ద్రవ్యలోటు పెరిగింది.

Comments

comments