Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

క్షీణించిన సేవల రంగం

 జిఎస్‌టితో మందగించిన డిమాండ్
 నవంబర్‌లో 48.5 శాతం నమోదు

tax

న్యూఢిల్లీ: నవంబర్‌లో దేశీయ సేవల రంగం స్వ ల్పంగా క్షీణించింది. ఇటీవల అమల్లోకి తీసుకొచ్చి న జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను), ధరలు పెరగడం వంటి అంశాలు సేవల రంగం మందగించడానికి కారణమయ్యాయి. జిఎస్‌టి అమలుతో డిమాండ్ తగ్గిందని, ఈ ఫలితంగా సేవల పరిశ్రమలో కస్టమర్ల స్థాయి తగ్గుముఖం పట్టిందని సర్వేలో తేలిం ది. మూడు నెలల్లో తొలిసారిగా దేశీయ సేవల రంగం క్షీణత నమోదు చేసింది. నవంబర్‌లో నిక్కీ/ ఐహెచ్‌ఎస్ మార్కిట్ సర్వీసెస్ పిఎంఐ(పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 48.5 శాతానికి పడిపోయింది. అక్టోబర్‌లో 51.7 శాతంగా ఉంది. అయితే ఆగస్టు నుంచి చూస్తే ఇదే అత్యంత దిగువస్థాయిగా సర్వే పేర్కొంది. జులైలో జిఎస్‌టి అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి వ్యాపారంలో డిమాండ్ మందగించడం, కస్టమర్ల ఆదరణ అంతంతగానే ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త ఆష్నా డోదియా తెలిపారు. కాగా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందంటూ మూడీస్ వంటి అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థలు అప్‌గ్రేడ్ ఇచ్చింది. కొన్ని సంస్థలు మాత్రం అంచనాలను తగ్గించాయి. తాజాగా అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) అంచనాల్లో కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించగా, గతంలో 6.9 శాతం ఉంటుందని చెప్పింది. భారత్ ఆర్థిక వ్యవస్థ ఆశించిన దాని కంటే బలహీనంగా ఉందని ఫిచ్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో 201819 ఆర్థిక సంవత్సరంలో జిడిపి అంచనా 7.3 శాతానికి తగ్గించగా, అంతకుముందు సెప్టెంబర్‌లో 7.4 శాతంగా పేర్కొం ది. అయితే క్రమంగా నిర్మాణాత్మక సంస్కరణల ఎజెం డా అమలు, అధిక వాస్తవ ఆదాయం నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో జిడిపి వృద్ధి రేటు పుంజుకోనుందని ఫిచ్ అభిప్రాయపడింది. రెండో త్రైమాసికంలో(జులైసెప్టెంబర్) దేశీయ వృద్ధి రేటు 6.3 శాతం ఉందని ప్రభు త్వం ప్రకటించింది. అంతకుముందు 5.7 శాతం జిడిపితో పోలిస్తే మెరుగైంది. ఆర్థిక ద్రవ్యోలోటు ఆందోళన కల్గించేలా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201718) అక్టోబర్ ముగింపు నాటి ద్రవ్యలోటు 96.1 శాతం దాటింది. గత ఏడా ది ద్రవ్యలోటు రూ. 4.2 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 5.25 లక్షల కోట్లుగా నమోదైంది. వృద్ధి రేటు పుం జుకున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం నియంత్రణపైనే రిజర్వు బ్యాంక్ దృష్టి పెట్టనుందని చెబుతున్నారు. రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) రెండు రోజులు సమావేశం బుధవారం స్పష్టమైన ప్రకటన చేయనుంది.

Comments

comments