Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఢిల్లీ టెస్టు డ్రా

Team-India

మూడో టెస్టు డ్రా, 1-0 తేడాతో సిరీస్ భారత్ వశం, కోహ్లీసేనకు వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌’ విరాట్ కోహ్లీ.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్  246/5 డిక్లేర్డ్

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373, రెండో ఇన్నింగ్స్ 299/5.

న్యూఢిల్లీ: వేదికగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు 87 ఓవర్ల ఆట కొనసాగగా భారత బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ధనుంజయ డిసిల్వా (119 రిటైర్డ్ హార్ట్) శతకం చేయగా, రోషన్ సిల్వా(74 నాటౌట్), డిక్వెల్లా(44 నాటౌట్), దినేష్ చండీమల్(36) పరుగులతో రాణించారు. దీంతో శ్రీలంక ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు చివరి వరకు వికెట్లు తీయడానికి యత్నించిన ఫలితం లేకుండా పోయింది. చివరకు మురళి విజయ్, కోహ్లీలు కూడా బౌలింగ్ చేయడం గమనార్హం. చివరి రోజు లంకేయులు కోహ్లీసేనను బాగానే నిలువరించారు.

31/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక ప్రారంభంలో సీనియర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూస్(1) వికెట్‌ను త్వరగానే పారేసుకుంది. కానీ ఆ తరువాత కెప్టెన్ చండీమల్, డిసిల్వా ద్వయం ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యం అందించి లంకను ఆదుకున్నారు. చండీమల్(36) పెవిలియన్ చేరిన తరువాత క్రీజులోకి వచ్చిన రొషన్ సిల్వా, కీపర్ డిక్వెల్లా జోడి చివరి వరకు నిలబడి లంకను ఓటమి నుంచి తప్పించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, షమీ, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. మూడు టెస్టుల సిరీస్ ను ఆతిథ్య భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా,  కోహ్లీసేనకు ఇది వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం కావడం విశేషం.

Comments

comments