Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రేషన్ డీలర్ల డిమాండ్లను నెరవేర్చాలి

hand2

మన తెలంగాణ/కాటారం: రేషన్ డీలర్లు చేస్తున్న న్యాయ సమ్మతమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమించేలా ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. గ్రామీణ మారుమూల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే డీలర్లు చాలీచాలని కమిషన్‌తో పూట గడవని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారనీ, పొరుగు రాష్ట్రాలల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడుతున్న రేషన్ డీలర్లను ప్రత్యేక తెలంగాణలో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. రేషన్ డీలర్లు ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా సిఎం కెసిఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. సిఎం, ఎమ్మెల్యేల జీతాలు లక్షలు లక్షలు పెంచుకున్నా తెరాస ప్రభుత్వం డీలర్ల ఇబ్బందులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లపై పలుమార్లు హామీలిచ్చి విస్మరించిన సిఎం కెసిఆర్‌కు, మంత్రి హారీష్‌రావుకు, ఈటల రాజేందర్‌కు ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారని విమర్శించారు.

Comments

comments