Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆర్‌బిఐ ప్రకటనతో మార్కెట్లలో నిరాశ

 205 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

nseముంబయి: ఆర్‌బిఐ సమీక్షా నిర్ణయాలతో మార్కెట్‌కు అసంతృప్తి లోనయి నష్టాలను నమోదు చేసింది. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడం, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మార్కెట్లు మరింత కిందకి పడిపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంలో 32,597 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,044 వద్ద స్థిరపడింది. ఆర్‌బిఐ పాలసీ ప్రకటన అనంతరం బ్యాంకు షేర్లు మరింత నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల షేర్లలో  భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగాయి. పిఎస్‌యు బ్యాంకు ఇండెక్స్ 1.5 శాతం కిందకి పడిపోయింది. నిఫ్టీ బ్యాంకు 170 పాయింట్లు నష్టాలు పాలైంది. మెటల్ ఇండెక్స్ కూడా 2 శాతం పైగా కిందకి పడిపోయింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 6 శాతం వద్ద, రివర్స్ రెపో 5.75 శాతం వద్ద కొనసాగించేందుకే ఆర్‌బిఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. యథాతథ పాలసీని అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేసినప్పటికీ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫార్మా, ఐటీ కూడా 1 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఐటి ఇండెక్స్ 0.5 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో బాష్, హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్, ఐషర్, వేదాంతా, సన్ ఫార్మా, అరబిందో, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, బిపిసిఎల్ పతమయ్యాయి. ఆర్‌ఐఎల్, టెక్ మహీంద్రా, మారుతీ, హెచ్‌యుఎల్, అంబుజా, హెచ్‌సిఎల్ టెక్ నష్టపోయాయి. మార్కెట్ల బాటలో మిడ్ సెషన్ నుంచీ చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బిఎస్‌ఇలో ట్రేడైన షేర్లలో 1637 నష్టపోగా, 984 మాత్రమే లాభపడ్డాయి. సోమవారం నగదు విభాగంలో ఎఫ్‌పిఐ(విదేశీ ఇన్వెస్టర్లు) రూ. 333 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించగా, మరుసటి రోజు మంగళవారం మరింత అధికంగా రూ. 1,470 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

Comments

comments