Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

అభివృద్ధే మా నినాదం

 

trs

*ఈ ప్రాంత అభివృద్ధే మా ప్రథమ లక్షం
*అభివృద్ధిని చూసే పార్టీలోకి వస్తున్నారు
*రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

మనతెలంగాణ/దౌల్తాబాద్:  తెలంగాణ రాష్ట్ర సమితి  పరిపాలనలో  ముఖ్యమంత్రి  కేసీఆర్  నాయకత్వాన  రాష్ట్రంలో  అభివృద్ధి  పరుగులు  పెడుతుందని  రాష్ట్ర  రవాణాశాఖా  మంత్రి  పట్నం  మహేందర్‌రెడ్డి  అన్నారు. మంగళవారం  రోజు  మండల  కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి  ఆలయ ఆవరణలో  ఏర్పాటు  చేసిన  కార్యకర్తల  సమావేశానికి  ఆయన ఎమ్మెల్సీ  పట్నం  నరేందర్‌రెడ్డి, మాజీ  ఎమ్మెల్యే  గురునాథ్‌రెడ్డితో  కలిసి   ముఖ్య  అథితిగా  హాజరయ్యారు. ఈ సందర్బంగా  పార్టీ  శ్రేణులు   మండల  కేంద్రంలోని  వీధులలో  మంత్రి  కాన్వాయ్‌తో  భారీ  ర్యాలీ నిర్వహించారు. అనంతరం   ఏర్పాటు  చేసిన  సమావేశంలో  మంత్రి  మహేందర్‌రెడ్డి  మాట్లాడుతూ  రాష్ట్ర  ప్రభుత్వం  ఎన్నికలకు  ముందు  రాష్ట్ర  ప్రజలకు  ఇచ్చిన  హామీలన్నింటినీ  బేషరతుగా  అమలు  చేస్తుందన్నారు. ఎన్నికలకు  ముందు   ఇచ్చిన   హామీలయిన  రుణమాఫీ, ఆసరా  పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ  తదితర  పథకాలన్నింటినీ  ప్రజలకు  ఇచ్చిన హామీ మేరకు  ఏ  ఆటంకం  లేకుండా   నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు   హామీ  ఇవ్వక  పోయినా  రైతులకు  24   గంటల నాణ్యమైన  ఉచిత  విద్యుత్తును  అందిస్తున్నామన్నారు. అలాగే  గొళ్ళ, కురుమ, యాదవులకు  రాష్ట్రంలో  4౦౦౦  రూపాయల  కోట్లతో  గొర్రెల  పంపిణీ  పథకాన్ని  అమలు  పరుస్తున్నామన్నారు. రైతును   రాజుగా  చూడా లనే  సంకల్పంతో ముఖ్యమంత్రి  రైతు సమన్వయ  సమితిలను  ఏర్పాటు  చేశారన్నారు.అందులో భాగంగానే భూసమగ్ర  సర్వే ను  నిర్వహింపజేస్తున్నారన్నారు. త్వరలోనే  రైతులకు  పంటల  పెట్టుబడి  పథకం  కింద  ప్రతి  రైతుకు  ఎకరానికి  8౦౦౦  రూపాయలను  పెట్టుబడిగా  వారి  ఖాతాలలో జమచేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోడంగల్ నియోజక వర్గంలో 35 కోట్ల రూపాయలతో 25౦౦ మంది రైతులకు రుణమాఫీ అందించామన్నారు. అలాగే ఈ ప్రాంతంలో 6725 మందికి ఆసరా పించన్లను అందిస్తున్నామన్నారు. 14 కోట్లతో త్వరలోనే గొర్రె కాపరులకు గొర్రెలను అందజేస్తామన్నారు. 35౦ కోట్లతో హైద్రాబాద్ నుండి పరిగి, కొడంగల్ మీదుగా బీజాపూర్ హైవే పనులను యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తున్నామన్నారు. అబివృద్దిలో వెనుకబడిన కోడంగల్ ప్రాంత అబివృద్ది కొరకు మఖ్యమంత్రి చిత్తశుద్దితో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రబుత్వం వెంటనే నిదులను మంజూరు చేస్తుందని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని నాగసార్, కుదురుమళ్ళ,ఇండాపూర్ గ్రామాలకు చెందిన పలువురు తేదేపా , కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌యస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మేనమామ లెక్క పెళ్ళిళ్లు చేస్తున్న సిఎం
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబాటుకు గురై ఆడపిల్లల పెళ్ళి చేసి అప్పుల పాలౌతున్న నిరుపేదల కోరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లలకు మేనమామ పాత్ర పోషిస్తున్నాడని ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిదిలోని తిర్మలాపూర్ గ్రామంలో పలువురు యువకులు ఎమ్మెల్సీ ఆద్వర్యంలో టీఆర్‌యస్ పార్టీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారిని ఎమ్మెల్సీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి రోడ్డు సౌకర్యంలేదని, అలాగే గ్రామంలో త్రాగు నీటికి నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. స్పందించిన ఆయన వెంటనే గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు గ్రామంలో బోరును వేయించనున్నట్లు వారికి హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం రానియ్యకుండా ప్రజల అవసరాలను గుర్తించి అబివృద్ది పథకాలను అమలు చేస్తున్నాడని అన్నారు. ప్రస్తుత కోడంగల్ ఎమ్మెల్యే ఈ ప్రాంతం నుండి రెండు సార్లు ఎన్నికై ఈ ప్రాంత అబివృద్దిని విస్మరించాడని ఆయన విమర్శించారు. కోడంగల్ ఎమ్మెల్యేనని పేరు చెప్పుకొని హైద్రాబాద్‌లో బ్లాక్‌మెయిలింగ్, సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నాడని ఆయన దుయ్యబట్టారు. టీఆర్‌యస్ పార్టీలోకి వచ్చిన వారంతా అమ్ముడు పోయారనే విషయం అవాస్తవమన్న ఎమ్మెల్సీ వారంతా అబివృద్దిని చూసే పార్టీలోకి వచ్చారన్నారు. అమ్ముడు కోనుడు అనేది టీఆర్‌యస్ పార్టీ సంస్కృతి కాదన్న ఆయన కాంగ్రేస్ పార్టీకి ఎంతకు అమ్ముడు పోయాడో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యేగా గెటిచి ఏనాడుకూడ గ్రామాలలో తిరుగని రేవంత్‌రెడ్డి తాము గ్రామ గ్రామానికి తిరుగుతుండటంతో గత్యంతరం లేక జెండావిష్కరణల పేరుతో గ్రామాలలో తిరుగుతున్నాడన్నారు. ఆయన మాయ మాటలు వినడానికి ప్రస్తుతం ఇక్కడ ఎవరూ సిద్దంగా లేరన్న ఎమ్మెల్సీ అలాంటి వారిని గ్రామాలలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకోవాలన్నారు. ఈ ప్రాంత అబివృద్దికి తాము ఎల్లప్పుడు సిద్దంగా ఉంటామన్న ఆయన ఎవరికి ఏ అవసరం వచ్చినా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ సభ్యురాలు వెంకటమ్మ, సర్పంచ్ పార్వతమ్మ, గొర్రెకాపరుల సంఘం చైర్మెన్ మాల్‌శెట్టి, కోస్గి ఎంపీపీ ప్రతాఫ్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, ముద్దప్ప దేశ్‌ముఖ్, మహాపాల్‌రెడ్డి, నర్వోత్తంరెడ్డి, అన్న కిష్టప్ప, నీలారెడ్డి, మదుసుధన్‌యాదవ్, రాస్నంబాల్‌రాజ్, జాకీర్‌హుస్సేన్, భీములు, మైనోద్దీన్, పకిరప్ప, భగవంతు, మల్లేశం పాల్గొన్నారు.

Comments

comments