Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఆదాయ వివరాలు వెల్లడించండి

temple

64మంది ఉద్యోగులకు ఇఒ సర్కులర్
మనతెలంగాణ/వేమువాడు: వేమలవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ విభాగం పర్యవేక్షకుడిగా ఉన్న నామాల రాజేందర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన జరిగిన దాడుల అనంతరం ఉద్యోగులందరికీ ఆలయ కార్యనిర్వహణాధికారి గురువా రం సర్కులర్ జారీ చేశారు. మొత్తం 300 మంది ఉద్యోగుల్లో 64 మంది అధికారులు, సిబ్బంది పది రోజుల్లోగా వారి ఆదాయ, ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని అందులో ఇఒ స్పష్టం చేశారు. నామాల రాజేందర్ నివాసంపై అనివీతి శాఖ అధికారులు దాడులు జరిపిన అ నంతరం ఆయన ఆస్తుల వివరాలను సేకరించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అధికారులు ఇఒను కోరిన నేపథ్యం లో ఇప్పుడు 64 మందికి ఆదేశాలు జారీ కావడం గమనార్హం. సహాయ పర్యవేక్షణాధికారు లు, సూపరింటెండెంట్‌లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగంలో వివిధ స్థాయిల్లో ఉన్న ఇంజనీ ర్లు.. ఇలా మొత్తం 64 మంది వారి వారి ఆదాయాన్ని, ఆ స్తుల వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలన్నది ఇవొ సర్కులర్‌లోని సారాంశం. ఆ స్తుల వివరాల్లో భాగం గా సొంత ఇళ్ళు, వాహనాలు, స్థిరాస్తులు, విలువైన గృహోపకరణాలు…ఇలా పలు అంశాలను కూడా ప్రస్తావించాల్సిందిగా సర్కులర్‌లో కోరారు. అయితే ఇలా ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందిగా ఉ ద్యోగులకు సర్కులర్ ద్వారా ఆదేశాలు ఇచ్చే అధికారం ఇవొ కు ఉందా అనే సందేహం కూడా పలువురు ఉద్యోగుల్లో నెలకొనింది. వచ్చే నెల మొదటి వారం వరకు గ డువు ఉన్నందువల్ల ఉద్యోగులు చర్చోపచర్చలు జరుపుకు న్న తర్వాత ఎంత మంది వివరాలను సమర్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Comments

comments