Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

జాతీయ స్థాయి క్యారం పోటీలకు జిల్లా విద్యార్థులు

school

మన తెలంగాణ/బెల్లంపల్లి : జనవరి 2 నుండి5 వరకు ముంబాయ్‌లో జరిగే జాతీయ స్థాయి సబ్‌జూనియర్స్ క్యారం పోటీలకు  ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా నుండి  విద్యార్థులు  ఎంపికయ్యారని అసోసియేషన్  కార్యదర్శి తనుగుల రాజన్న, తెలిపారు. గురువారం స్థానిక యువసంఘటన   పాఠశాల  ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదే పాఠశాలకు చెందిన విద్యార్థులైన యు. గిరివర్థన్, ఎండి అఫ్నాన్, ఎండి రుహిత్‌పాషా, బజార్ ఏరియా  పాఠశాలకు చెందిన జి.సాయి పల్లవిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో యువసంఘటన పాఠశాల ప్రిన్సిపాల్ సీతల్ యాదవ్, వైస్‌ప్రిన్సిపాల్ పి. లత, పిఈటి జ్యోతి,  అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి  ప్రసాద్‌గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments