Search
Wednesday 21 March 2018
  • :
  • :
Latest News

జనవరి నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తి

umprella+

మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలు వచ్చే జనవరి నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ఆదేశించారు. గురువారం స్థానిక గుమ్ముడూరులో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 350డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాల్సి ఉం డగా మొదటగా కేవలం 9ఎకరాల్లో జి ప్లస్ వన్ డబుల్‌బెడ్‌రూం బ్లాక్‌లో 8చొప్పున 25బ్లాక్‌ల్లో 200ఇండ్ల నిర్మాణాలు వేగవంతం గా చేయాలని బ్లాక్ బ్లాక్ మధ్యలో 9మీటర్ల ఖాళీ ప్రదేశం వెలుతురు, గాలికోసం వదులుతున్నట్లు తెలిపారు. మిగిలిన 150 ఇండ్ల నిర్మాణానికి పక్కన ఉన్న ఐదు ఎకరాల్లో ప్రభుత్వ భూమిని వెం టనే మెగా ఇంజనీర్స్‌కు అప్పచెప్పాలని ఆర్‌డిఓను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం నర్సంపేట రోడ్‌కు వెళ్ళే చౌరస్తాలో 3మీటర్ల వెడల్పుతో జంక్షన్ ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైవే, మున్సిపాల్టీ, రెవెన్యూ అధికారులతో సమన్వయ  సమావేశం ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జంక్షణ్ ఏర్పాటకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ ఆర్‌డిఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ భాస్కరావు, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, మె గా ఇంజనీర్స్ ప్రతినిథి మధు పాల్గొన్నారు.
5న జిల్లా యువజన ఉత్సవాలు
స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 5న జిల్లా యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా తెలిపారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో యువతలోని కళల ను ప్రోత్సహించేందుకు వారిలో దాగి ఉన్న కళాప్రావీణ్యాన్ని సాహిత్యం, సాంస్కృతిక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు 18రకాల అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాస్థాయి గెలుపొందిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయిలో పం పడం జరుగుతుందని తెలిపారు. జానపద గేయా లు, జానపద నృత్యాలు, ఏకాంకిక(స్కిట్) హిందీ, ఇంగ్లీష్‌లో బృంద అంశాలుగా, వక్తృత్వ పోటీ హిందీ, ఇంగ్లీష్‌లో, వ్యక్తిగతంగా, కర్ణాటక, హిందుస్థాని, శాస్త్రీయగాత్రంలో, భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిసి, మణిపురి నృత్య విభాగంలో శాస్త్రీయ విభాగంలో సితార్, ఫ్లూట్, గిటా ర్, వీణ, మృదంగం హార్మోనియం వివిధ విభాగా ల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల 15.-29ల్లోపు యువతీ యువకులు తమ అభ్యర్ధన పత్రాలను ఇందిరానగర్‌లోని జిల్లా యువజ న క్రీడల కార్యాలయంలో డిసెంబర్ 4లోగా సమర్పించాలన్నారు. నమోదు చేసుకున్నవారు ఈనెల 5న ఉదయం 9గంటలకు స్థానిక వీరభ్రహ్మేంద్రస్వామి ఆడిటోరియంలో పాల్గొనాలన్నారు.

Comments

comments