Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

నో..ఓకే.. మళ్లీ నో

నాటకీయ పరిణామాల నడుమ చివరికి విశాల్ నామినేషన్ తిరస్కరణ

                      Deepa-vs-Vishal

చెన్నై: ఆర్‌కె నగర్ ఉప ఎన్నికకు నటుడు విశాల్ నామినేషన్‌ను అనూహ్య పరిణామాల మధ్య చిట్ట చివరికి తిర స్కరించారు. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం వెలువరిస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు తొలుత నామినేషన్ పత్రాలు సరిగ్గాలేవంటూ రిటర్నింగ్ తిరస్కరించిన అధికారి విశాల్ మద్దతు దారుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. విశాల్ నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్టు చెప్పారు. మళ్లీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆయన నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటన వెలువరించారు. అయితే విశాల్ మంగళవారం సాయం త్రం ఫోన్ రికార్డింగ్‌ను విడుదల చేసి తన నామినేషన్ అంగీకరించినట్లు ప్రకటించాడు. తన ప్రగతికి ముప్పు కలిగించారని కూడా చెప్పుకొచ్చాడు. ‘చాలా పోరాటం చేశాక ఆర్‌కె నగర్ ఉపఎనికకు చివరికి నా నామినేషన్ పత్రాలను ఆమోదించారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది! న్యా య ం బతికింది. ప్రజాస్వామ్యం నిలబడింది’ అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.

దీపకూ చేదు అనుభవం…

మంగళవారం ఉదయం విశాల్ నామినేషన్ పత్రాలతోపాటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ పేపర్లు సరిగ్గా లేవంటూ తిరస్కరించారు. కాగా దీపా జయకుమార్ ‘ఇది రాజకీయ ప్రతీకా రం’ అని పేర్కొనగా, నామినేషన్ పత్రాలు పరిశీలించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు తన మద్దతుదారులతో విశాల్ నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించాడు. పోలీసులు అతడిని అక్కడి నుంచి తొలగించే వరకు బైఠాయించాడు. నాటకీయ పరిణామాల తర్వాత విశాల్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన అధికారి ఆయన నామినేషన్‌ను అంగీకరించారు. దీనిపై విశాల్ హర్షం వ్య క్తం చేశాడు. సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశాడు.

దీపా జయకుమార్ తన ఎన్నికల అఫిడవిట్‌లో అనేక కాలమ్‌లు సరిగ్గా నింపలేదని, అలాగే విశాల్ నామినేషన్‌ను ప్రతిపాదించిన 10 మందిలో ఇద్దరు చెన్నైలోని ఆర్‌కె నగర్‌కు చెందినవా రు కారని, నిబంధన ప్రకారం వారు ఆ ప్రాంతానికి చెందినవారై ఉండాలని అధికారులు తెలిపారు. ఆర్‌కె నగర్ స్థా నానికి పోటీ చేస్తున్న వారిలో ప్రముఖులున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయాక ఆర్‌కె నగర్ స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానానికి జరిగే పోటీ ప్రతిష్టాత్మకంగా తయారైంది. అధికారంలో ఉన్న ఎఐఎడిఎంకె ఆ సీటును నిలుపుకోవాలని చూస్తోంది. అందుకు తమ పార్టీ తరఫున ఇ. మధుసూదనన్‌ను అభ్యర్థిగా బరిలో నిలబెట్టింది. మధుసూదనన్‌కు చెన్నైలోని తెలుగు ప్రజల్లో మంచి పట్టుందని తెలుస్తోంది.దీప జయకుమార్ చీల్చుతుందేమో అనుకున్న పార్టీ ఓట్లు ఇప్పుడు ఎఐఎడిఎంకెకు పడొచ్చని భావిస్తున్నారు.

Comments

comments