Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

విజయవాడలో విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల ర్యాలీ

RALLY

విజయవాడ : సమాన పనికి సమాన వేతనం కల్పించడంతో పాటు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఒప్పంద కార్మికులు మంగళవారం విజయవాడలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఎపి వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న 24వేల మందిని క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కలిపించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను ఎపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Electricity Contract Employees Rally in Vijayawada

Comments

comments