Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోండి : అనూప్ సింగ్

stహైదరాబాద్ : రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని రాష్ట్ర ఎన్నికల  ప్రధాన  అధికారి అనూప్‌సింగ్ కోరారు. మున్సిపాలిటీల పరిధిలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఓటర్ల జాబితా సవరణపై సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. సమావేశంలో  ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రాంచందర్‌రావు (టిఆర్‌ఎస్),ఎం.శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్ (కాంగ్రెస్),ఎన్.రామచందర్‌రావు, ఎం.లక్ష్మణ్, ఎ.జితేంద్ర (బిజెపి), పల్లా వెంకటరెడ్డి (సిపిఐ) , సయ్యద్ అమీన్ జాఫ్రీ, అహ్మద్ బిన్ బలాలా, సయ్యద్ ముస్తాక్ (ఎం.ఐ.ఎం),   గంధం గురుమూర్తి (టిడిపి), జె.వెంకటేష్ (సిపిఎం), లు హాజరయ్యారు. అనంతరం అనూప్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఓటర్లను తొలగించాలని రాజకీయ పార్టీలు కోరినట్టు చెప్పారు. పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశామని, క్లెయిమ్స్‌ను ఎలా పూర్తి చేయాలో చూపించామన్నారు. ఓటరు ఉంటే తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి కూడా లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఓటర్ల జాబితా సవరణలో భాగస్వాములైతే సవరణ బాగా జరుగుతుందన్నారు. ఇందులో బూత్ లెవల్ అధికారి, సూపర్‌వైజర్, ఇఆర్‌ఒలు కృషి చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ఏవైనా తప్పులుంటే తమ దృష్టికి తీసుకువస్తే సరి చేస్తామని అన్నారు.

Comments

comments