Search
Thursday 24 May 2018
  • :
  • :

మార్స్‌పై ఆవాసాలు

offbeet

భవిష్యత్తులో అరుణగ్రహంపై మనుషులు ఉండేందుకు అక్కడ ఇళ్లను డిజైన్ చేయడంలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ సంస్థల ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్నేషనల్ మార్స్ సిటీ డిజైన్ పోటీలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన ఇంజినీర్లు, వాస్తుశిల్పుల బృందం అక్కడ ఇళ్ల నమూనాను నిర్మించి, మొదటి బహుమతిని గెలుచుకుంది. డోమ్ ఆకారంలో ఉండే ఇవి కాస్మిక్ రేడియేషన్, మైక్రో మీటియారైట్ ప్రభావాలు, ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పుల నుంచి రక్షణ కల్పిస్తాయని మిట్ టీమ్‌కు చెందిన పరిశోధకుడు వేలెంటినా సమినీ వెల్లడించాడు. ఒక్కో ఇంట్లో 50 మంది నివసించడానికి అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. ఈ టీమ్‌ను రెడ్‌వుడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ప్రతి డోమ్‌కు పైన సున్నితమైన సెల్స్‌ను ఏర్పాటు చేశారు. సోలార్ ప్యానల్స్ ద్వారా శక్తిని పొందుతాయని టీం తెలిపింది.

Comments

comments