Search
Friday 20 April 2018
  • :
  • :

వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

god2

*వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించిన
*శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి
*వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని
*దర్శించుకున్న చీఫ్ విఫ్ కొప్పుల
*కోరుట్ల ఎంఎల్‌ఎ విద్యాసాగర్‌రావు,

జగిత్యాల కలెక్టర్ శరత్
మనతెలంగాణ/ధర్మపురి:ప్రాచీన పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మినరసింహస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మక్కోటి ఏకదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రాతఃకాలం 2.30 గంటలకు ప్రధాన ఆలయమైన శ్రీయోగానంద స్వామి వారల మూల విరాట్టులకు అభిషేకం, ప్ర త్యేక పూజలు నిర్వహించారు.4 గంటలకు మువ్వురు స్వా ముల ఉత్సవ మూర్తులను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన వేదికపై ఆశీస్సులు చేసి వేద పండితులు సు మారు గంట పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద యం 5.20 నిమిషాలకు ధర్మపురి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజి, శ్రీశ్రీశ్రీ విశ్వజి స్వామిజీ కరకములచే ఉత్తర(వైకుంఠ) ద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు వరుస క్రమంలో స్వామి వారలను దర్శించుకున్నారు. ఈ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈ శ్వర్, కోరుట్ల ఎంఎల్‌ఎ విద్యాసాగర్‌రావు, ఐడిసిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జగిత్యాల కలెక్టర్ శరత్, జాయింట్ కలెక్టర్ రాజేశం,ఆర్‌డిఒ నరేందర్, పలువురు జడ్జిలు,పోలీస్ ఉ న్నతాధికారులు,వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారలను దర్శించుకున్నారు.ఉదయం 8.30గంటలకు స్వామి వార లసేవలను ఊరేగించారు. శేషప్ప కళావేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
దేవస్థాన చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఇఒ నాయిని సుప్రియలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి జడ్‌టిసి బాదినేని రాజమణి రాజేందర్, ఎంపిపి కొండపెల్లి మమత, సింగిల్‌విండో అధ్యక్షుడు బాదినేని రాజేందర్, వైస్ ఎంపిపి అయ్యోరి రాజేష్, తహసీల్దార్ నవీన్‌కుమార్, స్థానిక సర్పంచ్ సంగి సత్తమ్మ, దేవస్థాన ధర్మకర్తలు అక్కనపెల్లి సునీల్, సాయిని శ్రీనివాస్, జెట్టి రాజన్న, మధు నట్రా జ్ శర్మ, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు, మామిడి లింగన్న, దోమకొండ తిరుపతి, మురికి భా గ్యలక్ష్మి,స్థానిక ఎంపిటిసి సభ్యులు లక్కాకుల రాజ్యలక్ష్మి భగవంతరావు, అనంతుల విజయలక్ష్మి లక్ష్మన్, స్తంబంకా డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments