ఫేస్ బుక్ లో అదిరిపోయే ఫీచర్ ను యూజర్లకు ఆ సంస్థ అందించినుంది. ఎఫ్ బిలో ఒకరి ఫోటోలను మరొకరు వాడకుండా ఉండేందుకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకరానున్నారు. ఒకవేళ అవతలి యూజర్ వాడినా తెలిసిపోతుంది. ఫోటోలు పెట్టిన వ్యక్తిపై యుూజర్ ఫేస్ బుక్ కు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో సదరు ఎకౌంట్ ను ఎఫ్ బి సంస్థ బ్లాక్ చేస్తుంది.
ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని ఫేస్ బుక్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఒకరు ఫోటోలను మరొకరు వాడినచో వెంటనే నోటిఫికేషన్ పంపిస్తుంది. దీంతో ఆప్ లోడ్ చేస్తే వ్యకి ఎఫ్ బి ఖాతా బ్లాక్ అవుతుంది. ఫేస్బుక్లో రానున్న ఈ ఫీచర్ వల్ల ఒక యూజర్‌కు చెందిన ఫొటోలను మరొక యూజర్ వాడలేరని, ప్రొఫైల్ పిక్‌లుగా కూడా పెట్టుకోలేరని, ఈ ఫీచర్ తో నకిలీల బెడద తగ్గుతుందని ఎఫ్ బి సంస్థ వెల్లడించింది