Search
Saturday 21 April 2018
  • :
  • :

నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలి

stage

మనతెలంగాణ/జగిత్యాల : రోజు రోజుకు వ్యాధులు పెరుగుతున్నట్లుగానే నకిలీ మందుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, నకిలీ మందుల అమ్మకాలను ఆరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్యులు డాక్టర్ పద్మిని కుమార్, డాక్టర్ బాస శంకర్, డాక్టర్ రామేశ్వరి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటెటివ్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ మందుల ధరలు తగ్గించాలని, నాసిరకం మందులను ఆరికట్టాలని, ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ మెడికల్ రిప్రజెంటెటివ్‌లు ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు. మెడికల్ రిప్రజెంటెటివ్‌లకు ఐఎంఎ తరుపున సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో టిఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముకుంద్ కులకర్ణి, రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, జిల్లా అధ్యక్షులు కస్తూరి వెంకటరమణ, పిన్నం శెట్టి రాము, వీరానంద్, సునీల్, శ్రీదర్, జలేందర్, అజయ్‌రావుతో పాటు సిఐటియు జిల్లా కన్వీనర్ ఎం.ఎ. చౌదరి, ఆర్‌ఎంపి, పిఎంపిల సంఘం పట్టణ అధ్యక్షులు ఆకుల నాగరాజు, అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి శైలజ, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

comments