Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

పిఎస్ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

Suicide

సిద్ధిపేట : దుబ్బాక పోలీసు స్టేషన్ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. దుబ్బాక మండలం పెద్దగుండపల్లిలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం ఉంది. ఈ వివాదంపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో తమకు న్యాయం జరగదేమోనన్న భయంతో ఓ కుటుంబం పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. తన తల్లికి పురుగుల మందు తాగించిన అనంతరం తాను, తన తండ్రి తాగేందుకు ఆమె కుమారుడు యత్నించాడు. పురుగుల మందు తాగుతున్న తండ్రి కొడుకులను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే విషం తాగిన తల్లి అంజవ్వ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Family Suicide Attempt before Police Station

Comments

comments