Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

సామాజిక తనిఖీ సమావేశానికి జనం కరువు

tent-కేవలం సామాజిక ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహణ
-ఉపాధి సిబ్బంది నిర్లక్ష దోరణి వీడాలి
-ఎంపిపి కరుణాకర్‌రావు

మన తెలంగాణ /బల్మూర్: 2016-17 సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా చేపట్టిన పనులకు సం బంధించి గత వారం రోజుల పాటు గ్రామాలలో సామాజిక బృందాలు నిర్వహించిన తనిఖీ అనంతరం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణ ముందు నిర్వహించి న మండల స్థాయి సామాజిక తనిఖీ సమావేశానికి జనం కరువయ్యా రు. సామాజిక తనిఖీ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కూలీ లు, సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికి ఏగ్రామం నుంచి కూడా ఒక్క ఉపాధి కూలి కూడా వచ్చినట్లు సమావేశంలో కనిపించలేదు . కేవ లం ఉపాధి హామి పనులను తనిఖీ చేయడానికి వచ్చిన సామాజిక తనిఖి సిబ్బంది, ఉపాధి హామి , ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మాత్ర మే సమావేశంలో పాల్గొన్నారు. ఇట్టి సమావేశానికి డీఆర్‌డీఏ ఏపిడి లక్ష్మన్, ఎంపిపి కరుణాకర్‌రావు, ఎంపిడీఓ రాంజేంద్ర సింగ్ హాజ రైనారు. మండలంలోని 13గ్రామపంచాయతీలకు సంబంధించి ఏడాది కాలంలో ఉపాధి హామి ద్వారా ౩కోట్ల 80లక్షల రూపాయలు వివిధ పనుల కోసం ఖర్చు చేసినారు. ఇట్టినిధులు ఏవిధంగా ఖర్చు చేశారు. ఏ గ్రామంలో ఏఏ పనులు చేపట్టారు. వచ్చినటువంటి సామాజిక తనిఖీ బృందం గ్రామాల వారిగా తనిఖీ బృందం చదివి వినిపించారు. చాలా గ్రామాలలో రికార్డులు చేయకుండా బిల్లులు తీసుకున్నట్లు సామాజిక సిబ్బంది వెల్లడించారు. గతంలో సామాజిక తనిఖీ విభాగం నిర్వహిస్తే ఉపాధి హామి కూలీలు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే వారు. ఈ సమావేశానికి ఎవ్వరు కూడా అంతగా హాజరు కాక పోవడంతో కూలీ లు పనులకు పోవడంలో ఆసక్తి చూపడం లేదని దీనిని బట్టి అర్థమై తుంది. కూలీలు పనులకు పోయినాకూడా సకాలంలో బిల్లులు అంద డం లేదని మండలంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఎక్కువగా గ్రామాలలో సీసీ రోడ్లు పాంపండ్లు, వ్యక్తిగత మరుగుదోడ్లు వీటిపైన ఎక్కువగా దృష్టి సారించడంతో ఎక్కువ మొత్తం లో నిధులు వాటికి ఖర్చు చేస్తున్నందుకు ఉపాధి హామి కూలీల కు పనులు నామమాత్రంగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 13 గ్రామ పంచాయతీలలో జరిగిన పనులను గ్రామాల వారిగా తనిఖీ చేసి తనిఖీ సమావేశంలో సిబ్బంది చదివి వినిపించారు.
అవకతవకలు జరిగితే కఠిన చర్యలు: డిఆర్‌డిఎ ఎపిడి లక్ష్మన్
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా గ్రామాలలో జరిగే పనులకు అవకతవకలు జరిగినా పనుల విషయంలో సిబ్బంది నిర్లక్షం వహించి నా కఠిన చర్యలు తప్పవని డిఆర్‌డిఎ ఎపిడి లక్ష్మన్ అన్నారు. 2016-17 సంబంధించి 3కోట్ల 80లక్షలు ఖర్చు చేశారని అన్నారు. ఎక్కువ మొత్తంలో సీసీ రోడ్లు రైతులకు సంబంధించిన రోడ్లు ఇతర పనులను చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఎప్పటి కప్పుడు పను లను పరిశీలించి రికార్డులను వెంటనే చేసి లబ్దిదారులకు బిల్లులు అందే విధంగా చూడాలన్నారు. గ్రామాలలో జరిగిన అవతవకల పూర్తి వివరా లు ప్రకటించాల్సి ఉందన్నారు.
సిబ్బంది నిర్లక్షం వీడాలి: ఎంపిపి కరుణాకర్ రావు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులను నిర్లక్షం వీడి పనులు సక్రమం గా జరిగేలా చూడాలని ఎంపిపి కరుణాకర్‌రావు ఉపాధి సిబ్బందికి సూ చించారు. ప్రతి గ్రామంలో వ్యక్తి గత మరుగుదొడ్లు, రైతులను పాం పండ్లు నిర్మాణం విషయంలో లబ్దిదారులు పనులు చేసుకునేందుకు ఆస క్తిగా ఉన్నప్పటికి సిబ్బంది నిర్లక్షం వల్ల చాలా గ్రామాలలో పనులు ముందుకు సాగడం లేదన్నారు. గ్రామాలలో రైతులకు, ఉపాధి కూలీల కు అవగాహన కల్పించి వారికి కావాల్సిన పనులు కల్పిచాల్సిన అవస రం ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రాజేంద్రసింగ్, ఎపిఒ శ్యాం, సామాజిక తనిఖీ, డిఆర్‌పి, ఎస్‌ఆర్‌పి సిబ్బంది ఉన్నారు.

Comments

comments