Search
Friday 20 April 2018
  • :
  • :

1 నుంచి ఈపాస్ యంత్రాల ద్వారా ఎరువుల విక్రయాలు

madam

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: కేంద్ర,రాష్ట్ర ప్ర భుత్వాలు ఎరువుల అమ్మ కాలు ఈపాస్ యంత్రాల ద్వారా నిర్వహించాలని 2018 జనవరి 1 నుండి  అమలు చేయాల్సిందింగా నిర్ణయించిందని జిల్లా వ్య వసాయాధికారిణి  సుజాత  శనివారం  ఒక ప్రకటన లో తెలిపారు.  ఈపాస్  విధానాన్ని అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని  నిబందనలు డీలర్లకు ,రైతులకు  సూ చించింది.  ఎరువుల డీలర్లు ఈ పాస్  యంత్రా లను వినియోగించాలని,  ఎరువుల స్టాక్ లను, కంపెనీ పేర్ల ను ప్రొడక్ట్ వారి గా సంబంధిత మండల వ్యవసాయాధికారులతో సర్టిఫై  చే యించుకోవాలని సూచించారు. ఈనెల 24 వరకు ఈపాస్ యంత్రాల్లో న మోదైన ఎరువుల నిల్వలు రీసెట్  చేయబ డుతాయని ఆమె పేర్కొన్నారు. ఎ రువుల నిల్వలు మ ళ్లీ ఈ పాస్ యంత్రాల్లో తిరిగి ఈనెల  25 నుండి 30  తే దీల్లోగా మండల వ్య వసాయాధికారులతో  నమోదు రీఇన్షియలైజేషన్‌ను  చే యించుకోవాలి.  20 18 జనవరి 1 నుండి రైతులకు  ఎరువులను ఈ పాస్ యంత్రాల ద్వారానే  విక్రయించాలని ఆదే శించారు.  డీలర్లు ఏవైనా కార ణాలచే నిబంధనలు ఉ ల్లంఘించిన ఎడల వారి లైసెన్స్‌లను రద్దు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఫర్టిలైజర్స్ షాపుల యజమానులు రైతుల ఆధార్‌కార్డుల నమోదు తోనే  ఎరువులను విక్రయిం చాలని సూచించారు.  ఈ పాస్ విధానం ద్వారా రైతులు కొన్న ఎరువులకు మాత్రమే సంబంధిత ఎరువుల కంపెనీలకు సబ్సిడీ అందజేయ బడుతుందని ఆమె తెలిపారు.

Comments

comments