Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఈపాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయించాలి

collector

* 2018 జనవరి 1 నుండి
ఈపాస్ విధానం అమలు..
* డీలర్లు ప్రతి ఒక్కరూ ఈపాస్
యంత్రాలను వినియోగించాలి:
కలెక్టర్ శ్వేతామహంతి

మనతెలంగాణ/వనపర్తి ప్రతినిధి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల అమ్మకాలు ఈపాస్ యంత్రాల ద్వారా నిర్వహించాలని 2018 జ నవరి 1 నుండి అమలు చేయాల్సిందింగా నిర్ణ యించిందని కలెక్టర్ శ్వేతామహంతి శుక్రవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని నిబంధనలు డీలర్లకు ,రైతులకు సూచించింది. ఎరువుల డీలర్లు ఈ పాస్ యంత్రాలను విని యోగించాలని,ఎరువుల స్టాక్ లను, కంపెనీ పేర్లను ప్రొడక్ట్ వారిగా సంబంధిత మండల వ్యవసాయాధికారులతో సర్టిఫై చేయించుకో వాలని సూచించారు. ఈనెల 24 వరకు ఈపా స్ యంత్రాల్లో నమోదైన ఎరువుల నిల్వలు రీసెట్ చేయబడుతాయని వారు పేర్కొన్నారు. ఎరువుల నిల్వలు మళ్లీ ఈ పాస్‌యంత్రాల్లో తిరిగి ఈనెల 25 నుండి 30 తేదీల్లోగా మండ ల వ్యవసాయాధికారులతో నమోదు రీఇన్షియ లైజేషన్‌ను చేయించుకోవాలి. 2018 జనవరి 1 నుండి రైతులకు ఎరువులను ఈ పాస్ యం త్రాల ద్వారానే విక్రయించాలని ఆదేశించారు. డీలర్లు నిబంధనలు ఉల్లం ఘించిన ఎడల వారి లైసెన్స్‌లను రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఫర్టిలైజర్స్ షాపుల యజ మానులు రైతుల ఆధార్‌కార్డుల నమోదుతోనే ఎరువులను విక్రయించాలన్నారు. ఈపాస్ వి ధానం ద్వారా రైతులుకొన్న ఎరువులకు మాత్ర మే సంబంధిత ఎరువుల కంపెనీలకు సబ్సిడీ అందజేయబడుతుందని ఆమె తెలిపారు.

Comments

comments